హృతిక్ రోషన్, ప్రభాస్ ఇండస్ట్రీలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న మాస్ హీరోలు. ఇద్దరివీ ఆకర్షించే కటౌట్లు. జానర్ తో సంబంధం లేకుండా వారికోసం సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. అలాంటిది వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే.? ఆ ఆలోచనే బ్లాస్టింగ్‌గా ఉంది కదా.. కానీ ఇది త్వరలోనే నిజం కాబోతోందన్న టాక్ వినిస్తోంది. బాహుబలి సినిమాతో టాలీవుడ్ ప్రభాస్ కాస్తా ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత ప్రభాస్ నుండి సాహో అనే యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదికూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. అలాగే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్నటువంటి అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే. అలాంటి ప్రభాస్ పై ఇప్పుడు ఓ క్రేజీ రూమర్ వైరల్ గా మారింది. ఇప్పటికే బాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ము రేపిన ధూమ్ సిరీస్ లో ఈసారి ప్రభాస్ కూడా నటించబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది.
బీ టౌన్ బిగ్ ప్రొడక్షన్ కంపెనీ యష్ రాజ్ సంస్థ.. త్వరలోనే ‘ధూమ్ 4’ను పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉందట. తమ సంస్థ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సూపర్ హిట్ ధూమ్ సిరీస్ సీక్వెల్‌లో హృతిక్‌తో పాటు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ను నటింపజేయాలని నిర్మాత అనుకుంటున్నాడట. ఇందుకోసం సంప్రదింపులు జరపాలని, ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. నిజానికి ప్రభాస్ బాలీవుడ్ డెబ్యూ.. ధూమ్ యాక్షన్ సిరీస్ ఫ్రాంచైజ్ లో జరగాల్సింది అన్న ప్రచారం కూడా ఉంది. ఈ ధూమ్ సిరీస్ ద్వారానే జాన్ అబ్రహం – హృతిక్ రోషన్ – అమీర్ ఖాన్ విలన్ రోల్స్ చేసి సూపర్ క్రేజ్ అందుకున్నారు. ఈ ఫ్రాంచైజిలో హీరోలకంటే విలన్ క్యారెక్టర్స్ బాగా వర్కౌట్ అవుతాయి. అలాంటిది ధూమ్ 4 లో ప్రభాస్ కూడా ఉంటాడని వార్తలు వస్తుండటంతో.. ఆఫీషియల్ కన్ఫర్‌మేషన్ కో్సం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు..