ఒకప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో హీరో శ్రీకాంత్, రవళి, దీప్తీ పట్నాయక్ జంటగా నటించిన ‘పెళ్లి సందడి’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో సాంగ్స్ కూడా మంచి హిట్ అయ్యాయి. చాలా కాలం తర్వాత హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీ లీలా జంటగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం పెళ్లి సందD. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు.
తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తొలిసారిగా నటించడం విశేషం. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. శ్రీకాంత్ తనయుడు నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. పాతికేళ్ళ క్రితం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్ళిసందడి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.