తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హీరోగా మంచి సక్సెస్ బాటలో నడుస్తున్న సమయంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ స్థాపించి ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏపిలో ప్రజల పక్షాణ పోరాడుతున్న ఆయన ప్రస్తుతం సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ వస్తున్నారు. ప్రజల ఏ చిన్న కష్టమొచ్చినా.. నేను ఉన్నా అంటూ భరోసా కల్పిస్తున్నారు పవన్ కళ్యాణ్. అలాగే తాను తీస్తున్న సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ మద్య బీమ్లా నాయక్ బ్లాక్ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో షూటింగ్ బిజీలో ఉన్నారు. ఆ తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇలా ఒక వైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలతో రెండింటికి న్యాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ ఫోటో చక్కర్లు కొడుతుంది. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ మూవీ షూటింగ్ విరామ సమయంలో పవన్ సెట్స్ పైనే పడుకుని నిద్రపోవడం ఆ ఫొటోలో చూడొచ్చు.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగ్ గ్యాప్ లో ఒక నవారా మంచంపై పక్కన తుపాకీ పెట్టుకొని ఆదమరచి నిద్రపోయారు. దీనికి సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పేదల పక్షాన పోరాటం చేసే ఒక నాయకుడిగా కనిపించబోతున్నట్లు సమాచారం. మెగా ఫ్యాన్స్ ఈ ఫోటో పై తెగ కామెంట్స్ చేస్తున్నారు.