కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు క్షేత్రస్థాయిలో మద్దతు ఉందని.. టైమ్ వచ్చినప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమేనని తెలిపారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతామన్న పవన్ కళ్యాణ్.. తనను ఎవరూ డబ్బుతో కొనలేరని అన్నారు.. ఈ క్రమంలో తన రెమ్యూనరేషన్ పై ఓపెన్ కామెంట్స్ చేశారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు క్షేత్రస్థాయిలో మద్దతు ఉందని.. టైమ్ వచ్చినప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమేనని తెలిపారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతామన్న పవన్ కళ్యాణ్.. ఈసారి బలమైన సంతకం వేస్తామని.. ఓటు వృథా కాకుండా తనతో సహా జనసేన నుండి అందరం గెలిచి తీరాలని పిలుపునిచ్చారు. అయితే.. తనకు కావాల్సింది పూల మాలలు, గజమాలలు కాదని.. ఓట్లు వేసి గెలిపించాలని పవన్ కోరారు. ఈ క్రమంలో పలు కీలక అంశాలపై మాట్లాడిన పవన్.. తనను ఎవరూ డబ్బుతో కొనలేరని కౌంటర్ వేశారు.
పవన్ మాట్లాడుతూ.. ‘ఈ మధ్య కొంతమంది మాట్లాడుతున్నారు నాకు తెలంగాణ సీఎం కెసిఆర్ రూ. 1000 కోట్లు ఆఫర్ చేశారట. వెతుక్కుంటున్నా అవి ఎక్కడ ఉన్నాయని.. పవన్ కి వెయ్యి ఏమి ఖర్మ.. పదివేల కోట్లు అని అనుంటే వినడానికి కూడా బాగుండేది. నిజంగా డబ్బు పెట్టి మిమ్మల్ని కొనలగలనా? మూర్ఖులే అలా మాట్లాడతారు. డబ్బులతో నేను మీ గుండెల్లో స్థానం సంపాదించగలనా? వెయ్యి కోట్లు డబ్బులు తీసుకున్నా అన్నారు.. అంతకుముందు ప్యాకేజీ అని మాట్లాడారు.. వాళ్లందరికీ నేను చెప్పు చూపించాను. నేను డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదు. నాకు డబ్బు అవసరం లేదు.
నేను ఈరోజు మీకు క్లియర్ గా చెబుతున్నా.. ఇప్పుడు చేస్తున్న సినిమా. నేను 20 రోజులు చేస్తున్నా. రోజుకు రూ 2 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా. అంటే దాదాపు రూ. 40-45 కోట్లు తీసుకుంటాను. నా యావరేజ్ స్థాయి అది. ఆ స్థాయి కూడా మీరు ఇచ్చిందే. డబ్బులు అవసరం ఏమున్నాయి నాకు.. నన్నెవరూ డబ్బులతో కొనలేరు” అంటూ పవన్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో.. రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పవన్ వీరమల్లు, వినోదయ సితం సినిమాలే కాకుండా సుజీత్ తో ఓజి, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు లైనప్ చేశారు. మరి డబ్బుతో తననెవరూ కొనలేరని పవన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.