ఓ వ్యక్తికి అభిమానులు ఉండొచ్చు. వీరాభిమానులు ఉండొచ్చు. అదే వ్యక్తికి భక్తులు ఉన్నారంటే మాత్రం అక్కడున్నది పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన మనలాంటి సాధారణ మనిషి. కాకపోతే హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఆయన ఓ విషయం చెప్పారంటే చాలు.. ఫ్యాన్స్ దాన్ని తు.చ తప్పకుండా ఫాలో అయిపోతారు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు ఊగిపోతారు. థియేటర్లలో విజిల్స్ వేస్తూ, గోల చేస్తూ శివాలెత్తిపోతారు. యూత్ లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది. అలాంటి పవన్ కల్యాణ్.. ఓ విషయంలో మాత్రం చాలా పెద్ద తప్పు చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు.
ఇక విషయానికొస్తే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు చెప్పగానే ఆయన సినిమాలే గుర్తొస్తాయి. హిట్ ఫ్లాప్ అనే సంగతి పక్కనబెడితే ఆడియెన్స్ ని అవి విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. అయితే 2018 సంక్రాంతికి ‘అజ్ఞాతవాసి’ సినిమాతో వచ్చిన పవన్.. ఫ్యాన్స్ తోపాటు ప్రేక్షకుల్ని నిరాశపరిచారు. ఇక ఏపీలో 2019 శాసనసభ ఎన్నికల కోసం రంగంలోకి దిగుతానని చెప్పి, సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ కంగారుపడ్డారు. కొంపదీసి పూర్తిగా సినిమాలు మానేస్తారేమోనని ఆలోచనలో పడిపోయారు. అందుకు తగ్గట్లే పవన్, అసలు సినిమా టాపిక్కే తీసుకురాకుండా పూర్తిగా పాలిటిక్స్ లో బిజీ అయిపోయారు.
అలాంటి పవన్.. ‘వకీల్ సాబ్’ మూవీతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు 2020లో అనౌన్స్ మెంట్ వచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. తమ దేవుడు పవర్ స్టార్ మళ్లీ సినిమాలు చేస్తున్నాడనేసరికి ఆనంద పట్టలేకపోయారు. అయితే ఆ ఏడాది కరోనా విలయతాండవం చేయడంతో.. 2021 ఏప్రిల్ లో ‘వకీల్ సాబ్’ థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈ ఫిబ్రవరిలో ‘భీమ్లా నాయక్’గా వచ్చి, వరసగా రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టారు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. డైరెక్టర్ సుజీత్ తో గ్యాంగ్ స్టర్ మూవీ, ‘గబ్బర్ సింగ్’ లాంటి హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని తాజాగానే అనౌన్స్ చేశారు.
ఇటు సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్న పవన్ కల్యాణ్.. మరోవైపు పాలిటిక్స్ లోనూ చురుగ్గానే ఉంటున్నాడు. ఈ మధ్య తన ప్రచారం కోసం ‘వారాహి’ అనే వాహనాన్ని కూడా రెడీ చేశారు. దీని కోసం ఏపీ మంత్రులు, పవన్ మధ్య సోషల్ మీడియా వేదికగా వాడివేడి చర్చ నడుస్తూనే ఉంది. ఇక్క ఓ విషయం మాత్రం ఫ్యాన్స్ కి గట్టిగా కొట్టేస్తుంది. ఎందుకంటే రాజకీయంగా బలమైన శక్తిగా అవతరించాలనుకుంటున్న పవన్.. ఆ తరహా సినిమాలేవి ప్రస్తుతం చేయట్లేదు. 2024 ఎన్నికలకు మరెంతో కాలం లేదు. అన్ని రాజకీయ పార్టీలు దానికోసం ఇప్పటినుంచే ప్లాన్స్ రెడీ చేస్తున్నాయి. పవన్ కూడా అందుకు తగ్గట్లే సిద్ధమవుతున్నారు. కానీ తన పాలిటికల్ కెరీర్ కు హెల్ప్ అయ్యే ఒక్క సినిమాని ఈపాటికే స్టార్ట్ చేసి ఉంటే.. రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల ముందు గానీ ఒకవేళ ఆ సినిమా థియేటర్లలో రిలీజైతే.. ఆ ఇంపాక్టే వేరుగా ఉంటుంది. పవన్ కి రాజకీయాల పరంగా చాలా ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పుడు ఆ విషయంలోనే పవన్ తప్పు చేస్తున్నాడేమో అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఒక్కసారి ఆలోచించు జనసేనాని అని డిస్కస్ చేస్తున్నారు. మరి సినిమాల విషయంలో పవన్ తీసుకున్న నిర్ణయం సరైనదే అంటారా? మీ అభిప్రాయాన్ని దిగువన కామెంట్స్ లో చెప్పండి.
Ustaad @PawanKalyan will appear in 30 different attires & 3 Different Looks in #HariHaraVeeraMallu …!
It will be a massive treat for cine lovers 🔥 pic.twitter.com/knDEqpULpC
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) December 12, 2022
❤️🔥❤️🔥❤️🔥@PawanKalyan in and as #UstaadBhagatSingh 🔥
This time, it’s beyond entertainment 😎🔥
Shoot begins soon 💥❤️🔥@harish2you @ThisIsDSP @DoP_Bose @MythriOfficial pic.twitter.com/F7EFDOW3F8
— Mythri Movie Makers (@MythriOfficial) December 11, 2022