రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో తీస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. తొలుత ఈ సినిమాలో పవన్ కల్యాణ్ హీరోగా చేయాల్సింది కానీ అలా ఆయన చెప్పడం వల్ల హీరో మారిపోయాడు. అయినా సరే ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగానే ఉన్నారు.
అవును మీరు విన్నది నిజమే. కానీ ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది.అదేంటో తెలియాలంటే అలా స్టోరీ చదువుతూ వెళ్లండి మీకే తెలిసిపోతుంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నారు. పూర్తిస్థాయి పొలిటకల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో చరణ్.. డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో పవన్ కల్యాణ్ అనే న్యూస్ వైరల్ అయింది. ఏకంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ విషయం చెప్పేసరికి ఫ్యాన్స్ అలెర్ట్ అయిపోయారు. ఇంతకీ ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లోని కోట్లాదిమంది అభిమానులు ఊగిపోతారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలతో బిజీగా ఉన్నారు. దీంతో ఎక్కడ సభ ఏర్పాటు చేసినా సరే ‘సీఎం.. సీఎం’ అనే స్లోగన్స్ తో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే పొలిటికల్ స్టోరీస్ ఏమైనా రాస్తే.. చాలామంది డైరెక్టర్స్ పవన్ ని హీరోగా ఊహించుకుంటూ ఉంటారు. కాకపోతే అది అన్నిసార్లు వర్కౌట్ కాకపోవచ్చు. ఎందుకంటే పవన్ చేతిలోనే ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. అలా ‘గేమ్ ఛేంజర్’ మూవీ హీరోగా ఫస్ట్ ఫస్ట్ పవన్ కల్యాణ్ నే అనుకున్నారట.
‘శంకర్ గారు వచ్చి దాదాపు 45 నిమిషాల పాటు నాకు స్టోరీ నెరేట్ చేశారు. ఎవరినీ హీరోగా అనుకుంటున్నారని అడిగితే ఆయన పవన్ కల్యాణ్ పేరు చెప్పారు. ఈ స్టోరీకి పవన్ కంటే రాంచరణ్ బాగా సూట్ అవుతారని నేను చెప్పాను. దీనికి ఒప్పుకొన్న శంకర్.. ఆ తర్వాత చరణ్ కు స్టోరీ చెప్పారు. అలా ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది’ అని దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. ఒకవేళ ఈ మూవీ పవన్ చేసి, అది ఎలక్షన్ టైంలో రిలీజై ఉంటే రచ్చ వేరే లెవల్ ఉండేదని అనుకున్నారు. ఏదైతేనేం.. బాబాయి చేయాల్సిన మూవీలో అబ్బాయి చేస్తున్నాడు కదా అని హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి ‘గేమ్ ఛేంజర్’ పవన్ హీరోగా చేసుంటే ఎలా ఉండేదని మీరనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
In Shankar’s Mind Pawan Kalyan Was The First Choice For #RC15 #GameChanger pic.twitter.com/C52Ls3Nchl
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) April 6, 2023