బంగార్రాజు సినిమా ఫంక్షన్లో టికెట్ రేట్లపై స్పందించను, రాజకీయాలు మాట్లాడనంటూ నాగార్జున అన్న ఒక్క మాటతో ట్విట్టర్ లో ఈ విషయంపై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ‘ఏపీలోని సినిమా టికెట్ ధరల విషయంలో నాకు ఏ ఇబ్బంది లేదు.. నా సినిమాకు ఇబ్బంది లేదు. టికెట్ల ధరలు తక్కువ ఉంటే తక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ ఉంటే కాస్త ఎక్కువగా వస్తాయి. టికెట్ల ధరలు పెరుగుతాయని సినిమాని జేబులో పెట్టుకుని కూర్చోలేం. నెంబర్స్ ప్రతి ఏడాది మారుతూనే ఉంటాయి. ఈ నెంబర్ గేమ్స్ నుంచి నేనెప్పుడో బయటకు వచ్చాను’’ అని నాగార్జున అన్నారు. దీన్ని పట్టుకుని పవన్ ని ట్రోల్ చేసినవారు కొందరయితే, ఆ ట్రోలింగ్ ని బేస్ చేసుకుని నాగార్జునని ఆటాడేసుకున్నారు పవన్ అభిమానులు.
నాగార్జున ఎక్కడా తన ప్రసంగంలో పవన్ పేరు ఎత్తలేదు. కానీ పవన్ అభిమానులు మాత్రం నాగార్జునని ఓ ఆటాడేసుకున్నారు. ఏపీ ప్రభుత్వానికి నాగ్ భయపడ్డారని, అందుకే సినిమా టికెట్ రేట్ల గురించి సినిమా ఫంక్షన్లో ప్రస్తావించడానికి కూడా ఇబ్బంది పడ్డారని ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఇక్కడ నాగార్జున వేరే కోణంలో వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి రాజకీయాల్లో తరల దూర్చనని పరోక్షంగా తెలిపారు. కానీ పవన్ అభిమానులు దీన్ని వేరే విధంగా తీసుకుని.. నాగార్జునను విమర్శించడం ప్రారంభించారు. చెప్పను బ్రదర్ అంటూ అప్పట్లో అల్లు అర్జున్, పవన్ అభిమానులకి ఎలా బుక్కైపోయారో.. ఇప్పుడు నాగార్జున కూడా ఒక్క మాటతో అలాగే ఇరుక్కుపోయారు.
Neekey bro @PawanKalyan 😒 pic.twitter.com/mTRNRbI0i2
— KICK Tollywood 🌊🔥 (@KickTwood) January 5, 2022
కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ భయంతో పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన RRR, రాధేశ్యామ్ సినిమాలను వాయిదా వేశారు. ఈ తరుణంలో నాగార్జున బంగార్రాజు లైన్లోకి వచ్చేసింది. జనవరి 14న థియేటర్స్లో సందడి చేయబోతున్నారు బంగార్రాజు. మరి నాగార్జునపై జరుగుతున్న ట్రోలింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Nagarjuna Speech at #Bangarraju Release date announcement event
▶️ https://t.co/LuZeuq7kS8#BangarrajuOnJan14th pic.twitter.com/gBzOOTIlpD
— T2BLive.COM (@T2BLive) January 5, 2022