ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి తెలుగు ప్రజలందరికీ శుభకృత్ నామ సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. అన్నీ శుభాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు వారందరూ ఎక్కడ ఉన్నా ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ ఉగాది.. ఈ ఏడాది శుభకృత్ నామధేయంతో రావడం మరింత సంతోషంగా ఉందని అన్నారు. శుభకృత్ ఉగాది ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు.
ఈ ఏడాది పుష్కలంగా పంటలు పండి అన్నదాతల కష్టాలు తీరాలని.. వ్యాపారాలు సమృద్దిగా జరిగి మంచి లాభాలు రావాలని సమస్త జనులు సుఖ సంపదలతో విరాజిల్లాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.ఈ ఏడాది ధరల భారం పడకుండా చూడాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని.. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శుభకృత్ సంవత్సరంలో అందరికీ బాగా కలిసి రావాలని మనసారా భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.