పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అప్‌కమింగ్ మూవీ భీమ్లా నాయక్ చిత్రబృందం నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్ల సునామీ సృష్టించనుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘భీమ్.. భీమ్.. భీమ్లానాయక్’ ఎంత పెద్ద హిట్టో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ ఈ పాటే యూట్యూబ్ మ్యూజిక్స్‌లో ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు అలాంటి పాటే ఇంకోటి రిలీజ్ కానుంది. ఈ నెల 15వ తేదీన ‘అంత ఇష్టం’ అనే పాటను విడుదల చేయనున్నట్లు మాటల మాంత్రికుడు త్రివ్రికమ్ శ్రీనివాస్ తన ఫేస్‌బుక్ ఖాతాలో తెలిపారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.