ప్రస్తుతం ఓ వీడియో యుట్యూబ్‌ని షేక్ చేస్తోంది. చిరంజీవి పుట్టినరోజు హైలెట్స్‌ను ఒక వీడియోగా చేసి ‘మెగా డే ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి’ అంటూ కొణిదేల ప్రొడక్షన్ కంపెనీ యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశారు.
సినీ పెద్దలు, హీరోలు, కుర్రహీరోలతో మెగాస్టార్ పుట్టినరోజు సందడిగా జరిగింది. సినీ పరిశ్రమ మొత్తం తరలివెళ్లి ఆ మెగాస్టారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. అభిమానగణం పెద్దఎత్తున చేరుకుని చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మెగాస్టార్, పవర్‌స్టార్‌ని ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేవు. పవన్‌ను ముద్దు పెట్టుకుని మెగాస్టార్ గట్టిగా హత్తుకున్నారు. అన్నయ్యను పవన్ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా తమ్ముడు పవన్‌కల్యాణ్‌ను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. నెగెటివ్ కామెంట్ చేసేవాళ్లకు మెగా ఫ్యామిలీ గట్టిగా పంచ్ ఇచ్చిందంటూ అభిమానాలు అంటున్నారు.
తర్వాత కుటుంబసభ్యులు అందరితో కలిసి మెగాస్టార్ కేక్ కట్‌చేశారు. తమ్ముళ్లు, కుమార్తెలు, కొడుకులు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్ల మధ్య మెగాస్టార్ చిరంజీవి మెగా బర్త్ డే కన్నులపండువగా జరుపుకున్నారు.