పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 20 ఏళ్లకు పైగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్తున్నాడు. కొన్నేళ్లుగా ఓవైపు రాజకీయాలను, మరోవైపు సినిమాలను బ్యాలన్స్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తున్నాడు. ఇండస్ట్రీలోకి మెగాస్టార్ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తన సొంత టాలెంట్ తో మాసివ్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు.
పవర్ స్టార్ గురించి ఏ వార్త తెలిసినా ఫ్యాన్స్ లో ఆనందం మాములుగా ఉండదు. తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఓ క్రేజీ ఫోటో బయటికి వచ్చింది. ఆ ఫోటోలో 20 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానం ఎలా ఉండేదనే విషయం అర్ధమవుతుంది. కానీ ఖచ్చితంగా పవన్ ఆలోచనలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పుడున్న పొలిటిషన్ పవన్ భావాలు అప్పట్లో ఆయన స్వహస్తాలతో రాసిన అంశాలు మ్యాచ్ అవుతుండటం విశేషం. 20 ఏళ్ల క్రితం.. పవన్ కళ్యాణ్ ఓ పత్రిక కోసం స్వయంగా తన భావాలను రాసిచ్చిన పేపర్ వైరల్ అవుతోంది. మరి పవన్ ఆ పేపర్ లో ఏయే విషయాలు షేర్ చేసుకున్నాడో చూద్దాం!
“ఫ్రెంచ్ రెడ్ వైన్ తన వీక్ నెస్ అని తెలిపిన పవన్.. అన్నయ్య చిరు గన్ కొనిచ్చిన రోజు మర్చిపోలేనిది అన్నాడు. తనకు ఆడవారి చిరునవ్వు అంటే ఇష్టమని.. కానీ ఆడవారి కన్నీరు చూడలేనని.. నలుగురిలో మాట్లాడలేనని రాసుకొచ్చాడు పవన్. అలాగే రేప్ కు గురైన స్త్రీ గురించి వార్తలు వింటే మనసుకు బాధేస్తుందని.. అడవిలో ఒంటరిగా జీవించడం ఇష్టమని తెలిపాడు.ఇక ఇష్టమైన ఫుడ్ రాగిజావ, వెజ్ సాలాడ్.. అమితంగా ప్రేమించేది ప్రకృతిని.. ఎదుటివారిలో నచ్చేది నమ్ముకున్న వారికోసం నిలబడటమే అని.. నా ఆస్తి ఎటువంటి స్థితిలోనైనా ఎదుర్కొని నిలబడే మనస్తత్వమే.. అంటూ తనలో సమాజం పట్ల దాగి ఉన్న బాధ్యతను గుర్తు చేస్తున్నాయి. ఫేవరేట్ సినిమాలు వచ్చేసరికి.. మిస్సమ్మ, దేవదాసు, బ్రేవ్ హార్ట్, హిట్లర్ సినిమాలు. ఇవన్నీ 20 ఏళ్ల క్రితమే చెప్పినా.. ఆయన ఇప్పటికీ అవే విషయాలతో ముందుకు సాగుతున్నాడని పవన్ లైఫ్ స్టైల్ చూస్తే అర్ధమవుతుంది.
20 years back #pawankalyan personal feelings #pspk pic.twitter.com/9OmPkG9PV8
— Pulagam Chinnarayana (@PulagamOfficial) February 5, 2022
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలతో పాటు మరికొన్ని లైనప్ చేశాడు. త్వరలోనే భీమ్లా నాయక్ విడుదలకు రెడీ అవుతోంది. మరి పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానం, ఆయనా షేర్ చేసుకున్న విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.