రిలీజై ఏడాది కావొస్తున్న 'ఆర్ఆర్ఆర్' మేనియా ఇంకా నడుస్తూనే ఉంది. నాటు నాటు పాట ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంది. అలా ఓ పాక్ నటి.. ఈ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసి అలరించింది.
సినిమాకు భాష, ప్రాంతంతో అస్సలు సంబంధం లేదు. అలా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ నామినేట్ కావడమే దీనికి కారణం. అలా ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరూ ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇక రాజమౌళి తీసిన ఈ సినిమా కేవలం భారతదేశంలోనే కాకుండా చిన్న చిన్న దేశాల్లో సైతం ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ క్రమంలోనే మన దాయాది దేశమైన పాక్ లోనూ ‘ఆర్ఆర్ఆర్’ మేనియా కనిపించింది. అందుకు సంబంధించి ఓ వీడియో కూడా వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ సినిమా బాగుంది. దాదాపు రూ.1200 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. హాలీవుడ్ సెలబ్రిటీలు మెచ్చుకున్నారు. అక్కడివరకే బాగానే ఉంది. అయితే ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడంతో పాటు పలు పురస్కారాలు దక్కాయి. దీంతో రీల్స్ లోనూ ఈ గీతం చాలా ఫేమస్ అయిపోయింది. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ మెప్పిస్తున్నారు. తాజాగా పాక్ నటి హనియా ఆమిర్ కూడా ఓ పెళ్లిలో భాగంగా ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది.
ఈ పాటలో ప్రారంభంలో కాస్త రిథమ్ అందుకోలేకపోయింది గానీ హుక్ స్టెప్ వచ్చేసరికి మాత్రం పార్ట్ నర్ తో కలిసి ఆ లెగ్ స్టెప్ వేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల్ని మరోసారి ఎంటర్ టైన్ చేస్తుంది. ఇకపోతే మార్చి 12న 95వ ఆస్కార్ అవార్డ్స్ ని ప్రకటించనున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఉన్న ‘నాటు నాటు’.. ప్రపంచంలోనే అత్యున్నత అవార్డును గెలుచుకుంటుందా లేదా అనేది చూడాలి. మరి నాటు నాటు సాంగ్ కు పాక్ నటి స్టెప్పులేయడంపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.