ఈ మధ్యకాలంలో ఇది థియేటర్స్ లో రిలీజ్ అయితే బాగుండు.. అనిపించిన సినిమాలలో 'సార్పట్ట పరంపర'. మంచి సినిమాలు ఎప్పుడైనా సరే ఎక్కువ రీచ్ వెళ్తే బాగుంటుందని అందరికీ అనిపిస్తుంటుంది. ఎందుకంటే.. సినిమా రిలీజ్ అయ్యాక దానికి వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ బట్టి.. రీచ్ గురించి ఆలోచన వస్తుంది. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్లనో.. లేదా వేరే ఏవైనా కారణాల వల్లనో థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు.. ఓటిటిలో రిలీజ్ అవుతుంటాయి.
మంచి సినిమాలు ఎప్పుడైనా సరే ఎక్కువ రీచ్ వెళ్తే బాగుంటుందని అందరికీ అనిపిస్తుంటుంది. ఎందుకంటే.. సినిమా రిలీజ్ అయ్యాక దానికి వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ బట్టి.. రీచ్ గురించి ఆలోచన వస్తుంది. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్లనో.. లేదా వేరే ఏవైనా కారణాల వల్లనో థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు.. ఓటిటిలో రిలీజ్ అవుతుంటాయి. ఆ విషయంలో ఎవరూ ఏమి చేయలేరు. కానీ.. రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసరికి.. సినిమా చూసిన వారందరిలో.. అరే! ఇంతమంచి సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యుంటే బాగుండేది కదా.. ఇంకా ఎక్కువ రీచ్ వచ్చేది అని అంటుంటారు.
ఈ మధ్యకాలంలో ఇది థియేటర్స్ లో రిలీజ్ అయితే బాగుండు.. అనిపించిన సినిమాలలో ‘సార్పట్ట పరంపర’. అణగారిన వర్గాల కథలను అంతే ఒరిజినల్ గా తెరపై ప్రెజెంట్ చేసే కోలీవుడ్ దర్శకుడు పా. రంజిత్.. ఈసారి మరింత వినూత్నంగా తెరకెక్కించిన సినిమా ఇది. హీరో ఆర్య ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా కథ.. 80లలో నార్త్ చెన్నై ప్రాంతంలో రెండు వర్గాల మధ్య జరిగే బాక్సింగ్ నేపథ్యం చుట్టూ తిరుగుతుంది. ఎంతో ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ తో పా. రంజిత్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. కానీ.. లాక్ డౌన్ కారణంగా 2021 జులైలో సార్పట్ట పరంపర.. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది.
ఇదిలా ఉండగా.. ఓటిటిలో రిలీజ్ అయిన సార్పట్ట పరంపరకి సీక్వెల్ ని అనౌన్స్ చేశాడు దర్శకుడు రంజిత్. కానీ.. ఈసారి సీక్వెల్ ని మాత్రం థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నాడట. ముందుగా ఈ సినిమాని స్టార్ హీరోలు సూర్య – కార్తీ కాంబినేషన్ లో అనుకున్నాడట. కానీ.. వారు వేరే ప్రాజెక్ట్స్ వలన బిజీ కావడంతో.. ఆర్య – జాన్ కొక్కెన్ లతో తెరకెక్కించాడు. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేయడంతో ఇండస్ట్రీ వర్గాలలో మరోసారి సార్పట్ట గురించి చర్చలు మొదలయ్యాయి. అయితే.. ప్రస్తుతం పా. రంజిత్ .. చియాన్ విక్రమ్ హీరోగా ‘తంగలాన్’ అనే పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్నాడు. ఆ సినిమా అనంతరం సార్పట్ట 2 మొదలు కానుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. మరి ఓటిటిలో రిలీజైన సార్పట్టకి సీక్వెల్ రాబోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Kabilan returns🥊 For honour and glory🔥#Sarpatta2 Coming soon @arya_offl @officialneelam #TheShowPeople @NaadSstudios #JatinSethi @kabilanchelliah @pro_guna @gobeatroute pic.twitter.com/W7XNVkW6Vj
— pa.ranjith (@beemji) March 6, 2023