ఈ మధ్యకాలంలో ఇది థియేటర్స్ లో రిలీజ్ అయితే బాగుండు.. అనిపించిన సినిమాలలో 'సార్పట్ట పరంపర'. మంచి సినిమాలు ఎప్పుడైనా సరే ఎక్కువ రీచ్ వెళ్తే బాగుంటుందని అందరికీ అనిపిస్తుంటుంది. ఎందుకంటే.. సినిమా రిలీజ్ అయ్యాక దానికి వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ బట్టి.. రీచ్ గురించి ఆలోచన వస్తుంది. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్లనో.. లేదా వేరే ఏవైనా కారణాల వల్లనో థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు.. ఓటిటిలో రిలీజ్ అవుతుంటాయి.