ఒక సినిమా అయిపోయాక ఆ హీరో తర్వాత చేయబోయే సినిమాకి సంబంధించిన అప్ డేట్ రాకపోతే ఫ్యాన్స్ గోల గోల చేస్తారు. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజై చాలా కాలం అయినా గానీ ఎన్టీఆర్ తన తర్వాత సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ అన్నా ఒక అప్డేట్ కావాలంటూ తొందరపెట్టారు. ఎట్టకేలకు ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు.
ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఒకరకంగా ఎన్టీఆర్ కంటే ఎక్కువ జోష్ ఆయన ఫ్యాన్స్ కే ఉంది. ఆస్కార్ స్థాయి సినిమాలో అద్భుతమైన నటనతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న ఎన్టీఆర్ తర్వాత చేయబోయే సినిమా ఎలా ఉండబోతోందా అని ఫ్యాన్స్ తెగ ఆతురతగా ఉన్నారు. అయితే కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయ్యి చాలా రోజులైనా గానీ షూటింగ్ మాత్రం మొదలవ్వలేదు. అదిగో మొదలవుతుంది, ఇదిగో మొదలవుతుంది అనడమే తప్ప ఫ్యాన్స్ కి ఎప్పుడు మొదలవుతుందో అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడిపారు. మధ్యలో తారకరత్న మరణం ఒకటి ఎన్టీఆర్ ను కలచివేసింది.
ఇటువంటి పరిస్థితుల్లో షూటింగ్ మొదలుపెట్టడం ఎందుకనుకున్నారో లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయో తెలియదు గానీ మొత్తానికి ఇప్పుడైతే షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారో అప్ డేట్ ఇచ్చేశారు. ఎన్టీఆర్ ఏ ఫంక్షన్ కి వచ్చినా, ఈ ఈవెంట్ కి వచ్చినా అన్నా షూటింగ్ ఎప్పుడు, ఒక అప్ డేట్ మా ముఖాన పడేయ్ అంటూ అభిమానులు తొందరపెట్టారు. మొన్న అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ, నిన్న జరిగిన దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఇదే గొడవ. ఒక అప్డేట్ మా ముఖాన పడేయండి అన్న అంటూ గోల గోల చేశారు. దీంతో ఎన్టీఆర్ ఇస్తాలెండిరా.. ఇవ్వకుండా ఎక్కడికి పోతాం అంటూ కామెంట్స్ చేశారు.
ఎట్టకేలకు ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు. కొత్త సంవత్సరం ఉగాది వెళ్లిన మరుసటి రోజు అనగా మార్చి 23 నుంచి షూటింగ్ మొదలుపెడుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా.. అనిరుద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. మరి షూటింగ్ డేట్ ని ప్రకటించిన టీమ్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Storm alert ⚠️#NTR30 Muhurtam on March 23rd 💥💥@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @sabucyril @YuvasudhaArts pic.twitter.com/hD7O9Kh675
— NTR Arts (@NTRArtsOfficial) March 18, 2023