బాలీవుడ్ హాట్ యాక్ట్రెస్లో నోరా ఫతేహి ఒకరు. ఎక్స్పోజింగ్ క్యారెక్టర్స్, సాంగ్స్‌కు అస్సలు నో చెప్పని ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ తన అందచందాల ఫొటోలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటోంది.
ఇప్పుడు హీరోయిన్లు అందరూ సైజ్ జీరో లుక్‌ను మెయింటెయిన్ చేస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ అనే కాదు.. దాదాపు అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఇదే పరిస్థితి. కీర్తి సురేష్, మెహ్రీన్ పిర్జాదా లాంటి బొద్దుగా కనిపించే ఒకరిద్దరు ముద్దుగుమ్మలు కూడా ఇప్పుడు స్లిమ్‌గా తయారయ్యారు. అయితే స్లిమ్‌గా ఉన్నప్పటికీ ఫుల్ ఫిట్‌గా కనిపిస్తూ, అందాల జాతర చేసే అతికొద్ది మంది హీరోయిన్లలో బాలీవుడ్ స్టార్ నటి నోరా ఫతేహి ఒకరు. తెలుగు వారందరికీ నోరా సుపరిచితమే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘టెంపర్’ చిత్రంలో ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ పాటలో దుమ్మురేపిందామె. ఆ తర్వాత ‘బాహుబలి’ మూవీలో ‘మనోహరి’ సాంగ్‌తో ఇక్కడ మరింత గుర్తింపును సంపాదించింది.
హిందీ చిత్రాలతో పాటు ఇతర భాషల్లోనూ దూసుకుపోతోంది నోరా ఫతేహి. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అందాల తార.. సామాజిక మాధ్యమాల ద్వారా మార్కెటింగ్ చేసుకుంటుంది. తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తద్వారా అభిమానులను పెంచుకోవడంతో పాటు మరిన్ని సినిమా ఆఫర్స్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటుంది. నోరా ఫతేహి తన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో కుర్రకారును ఉర్రూతలూగిస్తుంది.
తాజాగా ఆమె ఓ అడ్వర్టయిజ్మెంట్ కోసం ఒక ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో టైట్ ఫిట్ బట్టల్లో తన అందాలు కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలతో మరోసారి యువత మతిపోగొడుతోంది నోరా ఫతేహి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ ఫోటోలు చూసి తమ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.