నిత్యా మీనన్.. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే మంచి నటిగా గుర్తింపును మూటగట్టుకుంది. అయితే ఈ మలయాళ బ్యూటీ నటిగానే కాకుండా సింగర్ గా కూడా అదరగొడుతోంది. నిత్యా మీనన్ తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించి స్టార్ హీరోయిన్ దూసుకుపోతోంది.
ఇక విషయం ఏంటంటే?.. అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అయితే తెలిపింది ఈ హీరోయిన్. గుడ్ న్యూస్ అంటే పెళ్లి మరెంటో అనుకునేరు. తన సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించినట్లుగా తాజాగా ఇన్ స్ట్రాగ్రామ్ లో తెలిపింది. నిత్య అన్ ఫిల్టర్డ్ అనే పేరుతో సరికొత్తగా అభిమానులకు దగ్గరయ్యేందుకు ఈ వేదికను ఎంచుకున్నట్లుగా ఆమె తెలిపింది.
ఇది కూడా చదవండి: శేఖర్ కమ్ముల లీడర్-2 లో హీరో ఇతనేనట!
మొదటి వీడియోతో తన 12 ఏళ్ల సినీ ప్రయాణాన్ని వివరించే ప్రయత్నం చేసింది నిత్యా. ఇక ముందు ముందు మరిన్ని వీడియోలతో మీ మందుకు వస్తానని తెలిపింది ప్రకటించింది. ఇక ప్రారంభించిన రోజే ఏకంగా లక్షలాది మంది సబ్ స్క్రైబ్ చేసుకున్నారట. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహిరిస్తుండటం విశేషం.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.