టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, హీరోయిన్ నభా నటేష్ కలిసి నటిస్తున్న చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో బంపర్ హిట్‌గా నిలిచిన అంధాధున్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు టాలీవుడ్ యువ దర్శకుడు మెర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా శ్రేష్ఠ మూవీస్ బ్యానెర్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్, ఫోటోస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో నితిన్ అంధుడి పాత్రలో కనిపిస్తూ దర్శనమిచ్చాడు. ఎప్పుడు లవ్ అండ్ కమర్షియల్ మూవీలో నటించే ఈ హీరో ఈ సారి ఓ ప్రయోగంతో ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్‌లో నితిన్ పాత్ర కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇందులో డైలాగ్‌లు అభిమానులను కాస్త ఆలోచింపజేసేలా ఉన్నాయి. దీంతో పాటు ఈ మూవీలో హీరోయిన్ నభా నటేష్ అందంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. దీంతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు కాస్త ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక మొత్తానికి మూవీ ట్రైలర్ విడుదల చేశారు కానీ విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. షూటింగ్‌లో ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.