కన్నడ చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ గా ఎదిగిన పునీత్ రాజ్ కుమార్ మరణం యావత్ సిని ప్రపంచాన్ని కన్నీటి సంద్రంలోకి నెట్టేసింది. శుక్రవారం జిమ్ చేస్తున్న పునీత్ గుండెపోటుతో కుప్పకూలిపోయి అక్కడే కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన పునీత్ అభిమానులు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక కొంత మంది అభిమానులు గుండెపోటుతో మరణించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక దీంతో అలెర్ట్ అయిన కర్ణాటక రాష్ట్ర సర్కార్ హై అలెర్ట్ ప్రకటిస్తూ పునీత్ భౌతిక కాయాన్ని సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచారు. అయితే కన్నడ సినీ పరిశ్రమలో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్న పునీత్ మరణవార్త విని అన్ని రంగాల ప్రముఖులు ఆయన ఆత్మశాంతి చేకురాలని ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు.
ఇక మరో విషయం ఏంటంటే..? కర్ణాటకలోని ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ యాంకర్ పునీత్ మరణవార్త చదువుతూ లైవ్ లోనే ఏడ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఒకటి నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది. పునీత్ మరణించాడని న్యూస్ చదువుతూనే అలా బరువెక్కిన గుండెతో లైవ్ లోనే కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో వెంటనే పక్కనున్న కెమెరా మెన్స్ వచ్చి ఆ యాంకర్ ను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక దీన్ని బట్టే అర్థమవుతోంది పునీత్ కు ఏ రంగంలోనైన ఎనలేని అభిమాన ఘనాన్ని సంపాదించుకున్నాడని.