కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఆరోగ్యంపై దృష్టిపెట్టారు. ఫిట్ నెస్ కోసం కసరత్తులు చేస్తుంటారు. అయితే సెలెబ్రెటీస్ విషయంలో ఇది కాస్త మరీ ఎక్కువుగా ఉంటుంది. అతిగా వ్యాయామం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని ఫిట్ నెన్ ట్రైనర్లు సైతం హెచ్చరిస్తుంటారు. తాజాగా రాజకీయ సినీ ప్రముఖులు వరుసగా గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ క్రమంలో జిమ్ చేస్తే గుండెపోటు వస్తుందా? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అతిగా జిమ్ చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వార్త ఒకటి వినిపిస్తోంది. ఇప్పుడు ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మరణానికి కూడా ఇదే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన విషయం అందరకి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో జిమ్ చేస్తూ చనిపోయిన ప్రముఖుల సంఘటనలను అందరూ గుర్తు చేసుకుంటున్నారు.
1) పునీత్ రాజ్కుమార్కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ వయసు కేవలం 46 ఏళ్లు మాత్రమే. రోజూ వ్యాయమం చేస్తూ చాలా ఫిట్‌గా ఉంటాడు. పైగా ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. ఎంతో ఫిట్‌గా కనిపించే పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ 29 న జిమ్ చేస్తున్న సమయంలో గుండెపోటుతో మరణించారు.
2) గౌతమ్ రెడ్డిఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం (ఫిబ్రవరి 21న) ఉదయం మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 49 సంవత్సరాలు. ఎంతో ఫిట్ గా కనిపించేం గౌతమ్ రెడ్డి వ్యాయామానికి అంత్యంత ప్రాధాన్యత ఇస్తారు.
3) ప్రవీణ్ కుమార్ సోబ్తిబీఆర్ చోప్రా యొక్క పౌరాణిక షో, మహాభారత్‌లో భీమ్ పాత్రను పోషించి ప్రసిద్ది చెందిన నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్తి 74 సంవత్సరాల వయస్సులో మరణించారు. ప్రవీణ్ తన భారీ శరీరంతో ప్రసిద్ధి చెందాడు. అనేక బాలీవుడ్ సినిమాలలో హెంచ్మాన్, గూండా, అంగరక్షకుని పాత్రను పోషించారు. అయితే బుల్లి తెర వీక్షకులను అలరించిన మహాభారత్ సీరియల్ లో భీముడిపాత్రను పోషించిన ప్రవీణ్ కుమార్ సోబ్తి ఈ ఏడాది ఫిబ్రవరి 7న గుండెపోటుతోనే మరణించారు.
4) సిద్ధార్థ్ శుక్లాప్రముఖ బాలీవుడ్ టెలివిజన్ నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా మరణం ఇప్పటికీ అభిమానులను కలచివేస్తోంది. కేవలం 40 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించారు. ఫిట్‌నెస్ కోసం ప్రాణమిచ్చే ఈయన ప్రాణాలు ఎలా పోయాయబ్బా అంటూ ఆరా తీశారు. ఈ అనుమానాలతోనే ఆయన చనిపోయిన తర్వాత పోస్టుమార్టం కూడా చేశారు. ఈ నివేదికలో కూడా గుండెపోటుతో ఆయన మరణించినట్లు తేలింది.
పైన తెలిపిన ప్రముఖులంతా ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ.. నిత్యం వ్యాయమాలు చేసే వారే. అయినా సరే వీరు అత్యంత పిన్న వయసులో.. గుండెపోటుతో మృతి చెందడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే వైద్యులు అతి వ్యాయమాలు మంచివి కావని హెచ్చరిస్తున్నారు.
ఇలా జాగ్రత్త పడాలి