కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. చిన్నప్పటి నుంచి ఎంతో అద్భుతమైన నటన ప్రదర్శిస్తూ ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్నాడు. హీరోగా మారిన తర్వాత వరుస విజయాలతో కన్నడ ఇండస్ట్రీలో తనదైన మార్క్ తెచ్చుకున్నాడు. అభిమానులు ముద్దుగా పవర్ స్టార్, అప్పు అని పిలిచేవారు. గత ఏడాది ఆయన గుండెపోటుతో కన్నుమూశారు.
కన్నడ ఇండస్ట్రీలో రాజ్ కుమార్ తన నటనతోనే కాదు డ్యాన్స్ తో ఉర్రూతలూగించేవారు. పునీత్ రాజ్ కుమార్ అంటే ఫ్యాన్స్ కి మాత్రమే కాదు సెలబ్రెటీలకు కూడా ఎంతో ఇష్టం.. ఆయన మరణం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ కన్నుమూసి ఏడాది అవుతుంది. కేవలం నటుడిగానే కాకుండా ఆయన ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఎంతో మందికి జీవనోపాది చూపించాడు, అనాధలకు ఆశ్రయాన్ని కల్పించారు. పునీత్ రాజ్ గొప్పతనాన్ని గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం ఆయనకు ‘కర్ణాటక రత్న’ బిరుదు ఇచ్చి గౌరవించబోతుంది. ఈ కార్యక్రమం నవంబర్ 1 న జరగబోతుంది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు కర్ణాటక ప్రభుత్వమే స్వయంగా పర్యవేక్షిస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. అయితే ప్రతిష్టాత్మక బిరుదు కార్యక్రమానికి పలు చిత్ర పరిశ్రమలకు సంబంధించిన స్టార్ హీరోలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ నుంచి యన్టీఆర్ హాజరవుతున్నారు. ఈ ఇద్దరు అగ్ర నటులతో పునీత్ రాజ్ కుమార్ కి ప్రత్యేక అనుబంధం ఉంది. వేలాది ఫ్యాన్స్, ప్రేక్షకులు హాజరువు అవాతారని భావిస్తున్నారు.