అభిప్రాయం చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మనం చెప్పే విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవచ్చు కానీ సెలబ్రిటీలు.. తాము ఏదైనా చెప్పేముందు ఆచితూచి మాట్లాడాలి. వాళ్లు మాట్లాడింది ఒకవేళ కరెక్టే అయినప్పటికీ.. ఎవరివైనా సరే మనోభావాలు దెబ్బతింటే.. దాని పర్యవసనాలు సదరు సెలబ్రిటీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ స్టార్ హీరో.. కొన్నాళ్ల క్రితం చనిపోయిన స్టార్ హీరో ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అది వాళ్లకు నచ్చలేదు. ఇప్పుడు అందరూ చూస్తుండగానే ఆ హీరోపైకి చెప్పు విసిరారు. అది అతడికి తగిలింది కూడా. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అసలు ఈ గొడవ జరగడానికి కారణమేంటి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. విషయం ఏదైనా సరే కన్నడ స్టార్ హీరో దర్శన్, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. రీసెంట్ గా అదృష్ట దేవత గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద కాంట్రవర్సీ అయ్యాయి. ‘అదృష్ట దేవత తలుపు తట్టినప్పుడు మనం అందుకోవాలి’ అని యాంకర్ అంటారు. దీనిపై స్పందించిన దర్శన్.. ‘ఒకవేళ తలుపు తట్టినప్పుడు మనం ఆమెని గదిలోకి లాక్కెళ్లి నగ్నంగా చేయాలి. అప్పుడు ఆమె ఇంట్లోనే ఉండిపోతుంది. ఒకవేళ డ్రస్ తిరిగిస్తే వెళ్లిపోతుంది’ అని అన్నారు. ఇదే కాదు గతేడాది పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దర్శన్.. ‘నా ఫ్యాన్స్ నన్ను ఎంతో ప్రేమిస్తారు. ఉదాహరణకు పునీత్ ని తీసుకోండి. ఆయన చనిపోయిన తర్వాత చాలా ఆదరణ చూపిస్తున్నారు. నేను మాత్రం బతికుండగానే ఫ్యాన్స్ ప్రేమ పొందుతున్నాను’ అని మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలు అప్పట్లోచాలా పెద్ద దుమారం రేపాయి.
ప్రస్తుతం దర్శన్ హీరోగా చేస్తున్న సినిమా ‘క్రాంతి’. వచ్చే నెలలో రిలీజ్ కానుంది. ఆదివారం సాయంత్రం ఈ మూవీలోని రెండో పాటని రిలీజ్ చేశారు. హోస్ పేటలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేయగా, హీరో దర్శన్ తోపాటు మూవీ యూనిట్ అంతా పాల్గొంది. నటీనటులు మాట్లాడుతుండగా.. అక్కడే ఉన్న దర్శన్, పునీత్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. కొంతసేపటికి ఓ వ్యక్తి హీరో దర్శన్ పై చెప్పు విసిరాడు. ఇలా జరిగేసరికి స్టేజీపై ఉన్నవాళ్లందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అయితే చెప్పు విసిరిన వ్యక్తిని ఏం అనవద్దని హీరో దర్శన్ చెప్పారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇరు హీరోల ఫ్యాన్స్.. ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటనేది.. కింద కామెంట్ చేయండి.
ಹೊಸಪೇಟೆಯಲ್ಲಿ ಕ್ರಾಂತಿ ಸಿನಿಮಾ ಹಾಡು ಬಿಡುಗಡೆ ವೇಳೆ ದರ್ಶನ್ ಮೇಲೆ ಚಪ್ಪಲಿ ಬಿಸಾಕಿದ ವ್ಯಕ್ತಿ..!@dasadarshan @Dbeatsmusik
#Hospete #DBoss #Boss #D #Darshan #DarshanThoogudeepaSrinivas #Kranti #KrantiMovie #KrantiMovieSong #KannadigaKrishna pic.twitter.com/DA0DrH0SGP
— ಕನ್ನಡಿಗ ಕೃಷ್ಣ ❁ (@kannadigkrishna) December 19, 2022