కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం ఆయన కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. అప్పు మృతిని ఇప్పటికి ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. ఇలాంటి సమయంలో పునీత్ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది.
పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని తండ్రి భగ్మనే రేవనాథ్(78) గుండెపోటుతో మరణించారు. పునీత్ మరణానంతరం భగ్మనే తీవ్ర స్థాయిలో ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలో ఆదివారం (ఫిబ్రవరి 20న) ఉదయం రేవనాథ్ కు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఒక్కసారి పునీత్ ఇంట్లో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి.
గతేడాది అక్టోబర్ 19 న గుండెపోటు మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం తట్టుకోలేక చాలామంది అప్పు అభిమానులు మరణించిన సంగతి తెలిసిందే. కాగా రేవనాథ్ గతంలో NHAI చీఫ్ ఇంజనీర్ గా పని చేశారు. అల్లుడి లాగే రేవనాథ్ కూడా మరణానంతరం తన కళ్లను దానం చేశారు. ఇప్పటికే భర్త పోయిన బాధలో ఉన్న అశ్వినికి తండ్రి రేవనాథ్ మరణం తీరని లోటనే చెప్పాలి.