Malavika Mohanan: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు, శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటి వరకు మనీ ల్యాండరింగ్ కేసుతో దేశ వ్యాప్తంగా అందరి నోళ్లలో నానారు. తాజాగా, సీబీఐ ఆయనపై మరో కొత్త కేసు నమోదు చేసింది. చైనా జాతీయులకు వీసాలు మంజూరు చేసే విషయంలో అక్రమాలకు పాల్పడట్టు కార్తీపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేయటంతో పాటు ఆయన మిత్రుడు ఎస్. భాస్కరరామన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇంత జరుగుతున్నప్పటికి సోషల్ మీడియాలో ఆయన యాక్టీవ్‌గా ఉండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
తాజాగా, హీరోయిన్ మాళవిక మోహన్ ట్విట్‌కు రిప్లై ఇచ్చిన ఆయన నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ‘ఎంపీ స్థాయి వ్యక్తి చేయాల్సిన పనేనా అది’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శుక్రవారం మాళవిక మోహన్ తన ట్విటర్ ఖాతాలో ‘‘ నేను కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ కోసం చూస్తున్నాను.. ఏవైనా సజెషన్స్ ఉన్నాయా?..’’ అని ట్వీట్ చేశారు. దీంతో ఆమె అభిమానులు కొన్ని వెబ్ సిరీస్‌ల పేర్లు చెప్పారు. వారందరికీ ఆమె రిప్లై ఇచ్చారు. కొన్ని నిమిషాల తర్వాత కార్తీ చిదంబరం లైన్లోకి వచ్చారు. తన ట్వీట్లో ‘‘ ఇన్వెంటింగ్ యానా’’ వెబ్ సిరీస్ పేరు చెప్పారు.దీనికి మాళవిక రిప్లై ఇవ్వలేదు. కానీ, నెటిజన్లు మాత్రం దీనిపై మండిపడుతున్నారు. ఎంపీ స్థాయి వ్యక్తి ఇలా చేయటం ఎంటని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నువ్వు మా ఎంపీవి అయినందుకు గర్వంగా ఉంది’’.. ‘‘ ప్రజా సేవ అంటే ఇదే..’’.. ‘‘దీన్నే ప్రజలకు సేవ చేసుకోవటం అంటారు’’.. ‘‘ ఎంపీగా గెలిపిస్తే.. నువ్వు చేసే పనులివా’’ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు! ఫన్నీ మీమ్స్, వీడియోలతో విజృంభిస్తున్నారు. మరి, కార్తీ చిదంబరంపై నెటిజన్ల మండిపాటుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Looking for some good new series/movies recommendations. Any suggestions? ☺️
— malavika mohanan (@MalavikaM_) May 20, 2022
Inventing Anna
— Karti P Chidambaram (@KartiPC) May 20, 2022
ఇవి కూడా చదవండి : Rajamouli: NTR బర్త్‌డేకు విష్ చేయని రాజమౌళి.. ఫ్యాన్స్ ఆగ్రహం!