Singer Sunitha: టాలీవుడ్ టు హాలీవుడ్ వరకు చాలా మంది సినీ సెలెబ్రిటీలు క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. వారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ఇతర విషయాలను అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. చాలా మంది నెటిజన్లు వీరిని ఫాలో అవుతూ, పెట్టిన పోస్టులను చూస్తూ ఆనందపడిపోతుంటారు. కొంతమంది అంతటితో ఆగకుండా వాటిపై కామెంట్లు కూడా చేస్తుంటారు. అలా ఓ సెలెబ్రిటీ ఫొటోపై కామెంట్ చేసి ఓ వ్యక్తి భార్య దగ్గర అడ్డంగా బుక్కయ్యాడు. ఇంతకీ సంగతేంటంటే.. ప్రముఖ సింగర్ సునీత తాజాగా తనకు సంబంధించిన ఓ ఫొటోను తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఆ ఫొటోలో ఫుల్ నెక్ టీషర్టుతో, కంటికి కాటుక, విరబోసిన కర్లీ జుట్టుతో అందంగా కనిపించారు. చాలా మంది నెటిజన్లు కూడా ఇదే విషయాన్ని తమదైన శైలిలో చెప్పారు. అలా రజిని బాబు అనే వ్యక్తి ‘‘ యూ లుక్ అమేజింగ్’’ అని కామెంట్ పెట్టాడు. అయితే, ఈ కామెంట్‌ను అతడి భార్య వెంకటలక్ష్మి ప్రత్తిపాటి చూసింది. ఆమె దానిపై స్పందిస్తూ ‘‘ రజిని బాబు ఓ అవునా’’ అని కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ భార్యభర్తల పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, భర్త యాక్షన్, భార్య రియాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : చాలా కాలం తరువాత కెమెరా ముందుకి వచ్చిన హీరో రోహిత్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.