సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ వెలిగిపోవాలనే కోరికతో.. ఎంతో మంది.. ఎన్నో ఆశలతో వస్తారు. వచ్చాక కానీ అసలు వాస్తవం బోధపడదు. తాము చూసేదంతా పైపై మెరుగులే అని.. ఆ నవ్వుల వెనక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు దాగున్నాయని అర్థం అవుతుంది. ఇండస్ట్రీలో అవకాశాలు రావడం ఎంత కష్టమో అర్థం అయ్యాక.. చాలా మంది తిరిగి తమ పాత జీవితంలోకి వెళ్లిపోతారు. కానీ కొందరు మాత్రం పట్టువదలకుండా ప్రయత్నించి సక్సెస్ అవుతారు. వరుస అవకాశాలు పొందుతారు. మరి వారి సక్సెస్ అలానే కొనసాగుతుందా అంటే లేదు. వరుసగా కొన్ని చిత్రాలు చేసిన తర్వాత సడెన్‌గా ఫేడ్ అవుట్ అవుతారు. ఉన్నట్లుండి వారికి అవకాశాలు ఆగిపోతాయి. పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే.. ఇండస్ట్రీ వారిని వెలివేసిందా అనే విధంగా ఉంటుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాను అంటుంది ఓ ప్రముఖ హీరోయిన్ ఆ వివరాలు..
నీతూ చంద్ర.. గోదావరి సినిమాలో హీరో సుమంత్ పక్కన అతడి మరదలిగా.. జాంగ్రీ తినాలో, లడ్డు తినాలో అర్థం కానంత అయోమయానికి గురయ్యే అమాయక అమ్మాయి పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా పలు తెలుగు చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నీతూ చంద్ర.. ఆ తర్వాత ఓ హాలీవుడ్ మూవీలో కూడా నటించింది. హిందీలో పలువురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ సరసన సినిమాలు చేసింది. ఇన్ని మంచి అవకాశాలు వచ్చినప్పటకి ఆమె కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగలేదు. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంది నీతూ చంద్ర. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ హంగామాతో ముచ్చటించింది నీతూ చంద్ర.. ప్రస్తుతం తన పరిస్థితి, తన లైఫ్‌లో ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.
అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం హీరోలుగా వచ్చిన గరం మసాలా చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నీతూ చంద్ర. ఆ తరువాత వరుస సినిమాలు చేసింది. కానీ గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఈ క్రమంలో నీతూ చంద్ర మాట్లాడుతూ.. ‘‘13 మంది జాతీయ అవార్డులు గెల్చుకున్న యాక్టర్స్‌తో నటించాను. ఎన్నో పెద్ద సినిమాల్లో యాక్ట్ చేశాను. మరి ఈ రోజు నా చేతిలో సినిమాలు లేవు.. డబ్బు లేదు. ఈ రోజు నేను ఇండస్ట్రీలోనే లేను’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.
‘‘నా జీవితం ఎలా ఉందంటే.. విజయవంతంగా రాణించిన ఓ నటి ఓటమిలా ఉంది. ఇదిలా ఉంటే ఓ బడా వ్యాపారవేత్త.. నాతో మాట్లాడుతూ.. నీకు నెలకు 25 లక్షలు ఇస్తాను. జీతం తీసుకునే భార్యగా నాతో ఉండు అన్నాడు. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు.. డబ్బు లేదు. ఎన్నో సినిమాలు చేశాను.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి నేను అవసరం లేదనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చింది.
‘‘ఇక మరో క్యాస్టింగ్ డైరెక్టర్.. ఇండస్ట్రీలో అతడు చాలా ఫేమస్ పర్సన్. నేను అతడి పేరు చెప్పాలనుకోవడం లేదు. ఓ సారి దాదాపు గంట సేపు నన్ను ఆడిషన్ చేసి.. చివర్లో.. సారీ నీతూ.. అని సింపుల్‌గా చెప్పేశాడు. గంటసేపు ఆడిషన్ ఇచ్చాక.. మీరు ఇంత దారుణంగా రిజెక్ట్ చేస్తే.. నా ఆత్మవిశ్వాసం ఎంత దెబ్బతింటుందో ఆలోచించారా’’ అని ప్రశ్నించింది. అంతేకాక తనకు హాలీవుడ్‌లో అవకాశం రావడం చాలామంది జీర్ణించుకోలేకపోయారని.. ఎవరి మద్దతు లేకుండా ఓ అమ్మాయి అంత పెద్ద ప్రాజెక్ట్‌లో లీడ్ క్యారెక్టర్ పొందడం చాలా మంది ఇండస్ట్రీలో కొందరికి నచ్చలేదని చెప్పుకొచ్చింది. మరి నీతూ చంద్ర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.