గుట్టు చప్పుడు కాకుండా ఓ పొలిటికల్ లీడర్ ను పెళ్లి చేసుకుంది స్టార్ హీరోయిన్. ఇక తమ ప్రేమ, పెళ్లి ఎలా జరిందిందో ఓ షార్ట్ వీడియోలో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ కలిసి బయట కనపడితే చాలు వారి మధ్య సమ్ థింగ్ స్పెషల్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతుంటాయి. దాంతో ఇలాంటి విషయాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఉండటానికే ఎక్కువ మంది సెలబ్రిటీలు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే సినిమా పరిశ్రమలో ఓ సంచలన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే? ఓ స్టార్ హీరోయిన్ గుట్టు చప్పుడు కాకుండా ఓ రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా చాలా జగ్రత్త పడింది ఈ అమ్మడు. తాజాగా తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలిపింది. తన చిరకాల స్నేహితుడు, ప్రియుడు అయిన ఫహద్ అహ్మద్ ను సీక్రెట్ గా వివాహం చేసుకుంది. వీరిద్దరికి జనవరి 6న పెళ్లి జరగగా.. ఆ విషయాన్ని ఫిబ్రవరి 16న తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ఈ బ్యూటీ. వీరిద్దరి జర్నీ ఎలా సాగిందో ఓ షార్ట్ వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక జనవరి 6న వీరిద్దరు ఎవరికీ తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలిపింది. ఫహద్ అహ్మద్ సమాజ్ వాది పార్టీ లీడర్ గా కొనసాగుతున్నాడు. స్వర భాస్కర్ ఈ వీడియోను షేర్ చేస్తూ..”ప్రేమను వెతికితే మెుదట స్నేహం ఎదురౌతుంది. ఆ తర్వాతే అది ప్రేమతో ముగుస్తుంది. ఈ ప్రేమ ప్రయాణంలో ఒకరిని ఒకరు తెలుసుకున్నాం. చివరిగా నాకు ప్రేమ చిక్కింది. వెల్ కమ్ టూ మై హార్ట్ ఫహద్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది స్వర భాస్కర్. ఇక ఈ వీడియో బయటికి రావడంతో ఒక్కసారిగా కంగుతిన్నది బాలీవుడ్ ఇండస్ట్రీ. మరి గుట్టు చప్పుడు కాకుండా రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.