రజాకార్.. ఇప్పటి తరం వారికి ఈ పేరు, దాని వెనక ఉన్న చరిత్ర పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 50-60 ఏళ్ల వయసు వారి ముందు ఈ పేరు చెబితే.. ఆ చీకటి రోజులు మరో సారి వారి కళ్ల ముందు మెదులుతాయి. కశ్మీర్‌లో ఎలా అయితే పండిట్ల మీద అరాచకాలు, హత్యాచారాలు ఎలా సాగాయో.. నిజాం పాలనలో తెలంగాణలో అలాంటి నరమేధమే జరిగింది. రజాకార్.. రాక్షసత్వానికి నిలువెత్తు రూపం. బతికున్న మనిషికి భూమ్మీదే నరకం చూపించిన రాక్షసులు రజాకార్లు. మరీ ముఖ్యంగా ఆడవారిపై రజాకార్లు చేసిన అత్యాచారాలు అన్ని ఇన్ని కావు. చరిత్ర పుటల్లో లిఖించిన ఈ వాస్తవాలను చదివితేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటి అకృత్యాలను దృశ్యరూపంలో చూస్తే.. ఆ ప్రయత్నమే చేస్తున్నారు సక్సెస్‌ఫుల్ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్. ప్రస్తుతం ఆయన రజాకార్ లైన్ సిద్ధం చేస్తున్నారని సమాచారం. కొన్ని రోజుల క్రితం కశ్మీర్ పండిట్లపై జరిగిన ఊచకోతను కశ్మీర్ ఫైల్స్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం.. అది భారీ విజయం సాధించిడం తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలో రజాకార్ ఫైల్స్‌ను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. మరి ఇది వాస్తవ రూపం దాలిస్తే మాత్రం.. తెలంగాణలో ఈ సినిమా పెను సంచలనంగా మారడం ఖాయం. మరి విజయేంద్రప్రసాద్ సిద్ధం చేయబోయే ఈ కథను రాజమౌళియే తెరకెక్కిస్తాడా లేక మరేవరైనా ఈ సినిమా చేస్తారా అనే విషయాల గురించి ప్రస్తుతం నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై బండి సంజయ్ ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా.. విజయేంద్ర ప్రసాద్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: తండ్రి చేసిన పనికి ఏడ్చేసిన రాజమౌళి.. ఇది కూడా చదవండి: ఆర్జీవీపై విజయేంద్ర ప్రసాద్ సంచలన కామెంట్స్! వర్మ స్ట్రాంగ్ రిప్లయ్!