Nazriya Nazim: ‘రాజారాణి’ సినిమాతో కుర్రకారు హృదయాల్ని దోచుకున్నారు హీరోయిన్ నజ్రియా నజీమ్. ఆ ఒక్క సినిమాతో తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ‘రాజారాణి’ సినిమాలోని ఆమె ఎక్స్ప్రెషన్స్కు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా కెరీర్ పీక్స్‌లో ఉన్న టైంలోనే ఆమె ప్రముఖ హీరో ఫాహద్ ఫజిల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన నాలుగేళ్లకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ‘‘కూడే’’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. రీఎంట్రీ తర్వాత తెలుగులోనూ సినిమా చేశారు. ‘అంటే సుందరానికి’ ఆమె మొదటి తెలుగు సినిమా. హీరో నానికి జంటగా నటించారు.
ప్రస్తుతం వరుస ఆఫర్లతో ముందుకు దూసుకుపోతున్నారు. తీరికలేని షూటింగ్‌లతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ షూటింగ్ కోసం థాయ్ ఎయిర్వేస్ విమానం ఎక్కిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. థాయ్ ఎయిర్వేస్ ట్రీట్మెంట్.. సిబ్బంది తీరు ఆమెకు అసహనం తెప్పించాయి. దీంతో సదరు ఎయిర్వేస్పై మండిపడ్డారు. దీనిపై సోమవారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీ పెట్టారు.
‘‘ థాయ్ ఎయిర్వేస్ ఓ చెత్త! నేనెప్పుడూ.. ఏ ఎయిర్‌వేస్‌తో కానీ, సిబ్బందితో కానీ ఇంత భయంకరమైన అనుభవాన్ని పొందలేదు. బ్యాగులు పోయాయి. సహాయం కోసం వెళితే వాళ్లు పట్టించుకోలేదు. ఇంకోసారి నా జీవితంలో ఈ అద్భుతమైన థాయ్ ఎయిర్వేస్ ఎక్కను’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మరి, ఎక్స్ప్రెషన్ క్వీన్‌కు ఇబ్బంది కలిగించిన థాయ్ ఎయిర్వేస్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ‘కార్తికేయ 2’ కలెక్షన్స్! మూడో రోజే బ్రేక్ ఈవెన్.. ప్రాఫిట్ ఎంతంటే!