ప్రస్తుతం దక్షిణాదిలో ఏ జంట పెళ్లి గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది అంటే.. లేడీ సూపర్ స్టార్ నయనతార-విఘ్నేష్ శివన్ల గురించే. కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరు లవ్ చేసుకుంటున్నారు. తమ ఒంటరి సింగిల్ లైఫ్ కి గుడ్ బై చెప్పి భార్యా భర్తలు కాబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 9న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఇప్పటికే పెళ్లి షాపింగ్, ఇతర పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. బంధు మిత్రులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకి హాజరుకానున్నారు. ఈ క్రమంలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది నయనతార విఘ్నేష్ ల వెడ్డింగ్ కార్డు.
ఈ వెడ్డింగ్ ప్రకారం నయన–విఘ్నేష్ లు తమిళనాడులోని మహాబలిపురంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం వీరి పెళ్లి తిరుపతిలో జరుగుతుందనే ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని.. మహాబలిపురంలో జరగబోతున్నట్టు ఈ వెడ్డింగ్ కార్డు ద్వారా బయటపడింది. అయితే ఇప్పటికే కొందరు గెస్ట్ ల కోసం”డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్”ని కూడా పంపించడం జరిగిందట. ఆ వెడ్డింగ్ కార్డు కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. మరి… ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కన్నీరు పెట్టించే జబర్దస్త్ లేడీ గెటప్ ఆర్టిస్టుల కష్టాలు.. వీడియో వైరల్!