గృహలక్ష్మి సీరియల్ ద్వారా మనల్ని అలరిస్తున్న నటి కస్తూరీ శంకర్. తులసి క్యారెక్టర్‌లో ఆమె నటన ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఎంతైనా సీనియర్ నటీమణి కదా. తెలుగులో సోగ్గాడి పెళ్లాం, నిప్పురవ్వ, చిలక్కొట్టుడు, అన్నమయ్య, ఆకాశవీధిలో వంటి సినిమాల్లో నటించింది.
గృహలక్ష్మి సీరియల్ ద్వారా మనల్ని అలరిస్తున్న నటి కస్తూరీ శంకర్. తులసి క్యారెక్టర్‌లో ఆమె నటన ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఎంతైనా సీనియర్ నటీమణి కదా. తెలుగులో సోగ్గాడి పెళ్లాం, నిప్పురవ్వ, చిలక్కొట్టుడు, అన్నమయ్య, ఆకాశవీధిలో వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో వదిన, అమ్మ పాత్రలకు పరిమితమైంది. అలాగే టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. సామాజిక కార్యకర్త అయిన ఆమె పలు అంశాలపై తరచూ మాట్లాడుతూ ఉంటుంది. ఇటీవల ఆదిపురుష్ సినిమాపై కూడా విమర్శలు చేసిన సంగతి విదితమే. రాముడికి మీసాలు ఉంటాయా అంటూ దర్శకుడిని చెడామడా తిట్టేసింది. గతంలో సరోగసిపై నయనతార పేరు ప్రస్తావించకుండా ఆమెను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసింది.
ఇప్పుడు తాజాగా మరోసారి నయనతారనుద్దేశించి విమర్శలు గుప్పించింది. నయనతారకు లేడీ సూపర్ స్టార్ అన్న బిరుదు ఉన్న సంగతి తెలిసిందే. నయనతారను తాను లేడీ సూపర్ స్టార్ గా ఒప్పుకోలేనని తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ ఎవరు అనగా.. చిన్న పిల్లలు అడిగినా చెబుతారు రజనీకాంత్ అని. ఆ పేరుకు ఆయనే యాప్ట్ అని అన్నారు. ఆ తర్వాతే.. కమల్, విజయ్, అజిత్‌లని పేర్కొంది. ఇక లేడీ సూపర్ స్టార్ అన్న ప్రశ్నకు.. కెపి సుందరాంబల్, విజయశాంతి పేర్లను ప్రస్తావించింది. తాను నయన్ ఫ్యాన్ అంటూనే.. ఆమెను లేడీ సూపర్ స్టార్ అనలేనని చెప్పింది. ప్రస్తుతం నయన్ పట్ల కస్తూరీ చేసిన వ్యాఖ్యలు ఆమె అభిమానుల్ని ఆగ్రహానికి గురి చేసేలా చేసింది.