Naresh: గత కొన్ని రోజులుగా తెలుగు, కన్నడ ఇండస్ట్రీలలో నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్‌ల పెళ్లిపై తీవ్రమైన చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారంటూ కన్నడ మీడియాలో వార్తలు సైతం వచ్చాయి. ఈ పెళ్లి వార్తలపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి స్పందించారు. నరేష్‌తో తన సంబంధాలు ఇంకా తెగిపోలేదని అన్నారు. తాను ఇంకా విడాకుల పేపర్లపై సంతకం చేయలేదని స్పష్టం చేశారు. ఆయన భార్యనని తాను చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ఇక నరేష్ కి.. తన గురించి, తన కుటుంబం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఆయన కుటుంబం గురించి మాట్లాడుకుంటే చాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై నరేష్ స్పందించారు. ఆయన తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నేను పురుషుడ్ని.. అంతేకాదు! మనిషిని కూడా.. నేను వందలు, వేల మందికి సహాయం చేశాను. కానీ, అదంతా చెప్పదల్చుకోలేదు. నాకు ఓ ఎమోషనల్ సపోర్టు అవసరం. నాకు స్నేహం కావాలి. నేను ‘హ్యాపీ వెడ్డింగ్’ సమయంలో పవిత్రా లోకేష్‌ను కలిశాను. మేము ఫ్రెండ్స్ మాత్రమే. సమ్మోహనం సమయంలో మేము కనెక్ట్ అయ్యాం. నేను నా బాధలు చెప్పుకున్నా.. ఆమె తన బాధలు చెప్పుకుంది.
అప్పుడు ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అయింది. నా ఫ్యామిలీ ఫ్రెండ్ అయింది. అందరూ అంటున్నట్లుగా ఆమె నా ఫ్యామిలీ ఫంక్షన్లన్నిటిలో ఉంటుంది. రమ్య.. ఫ్యామిలీ ఫంక్షన్లలలో నువ్వెక్కడ ఉన్నావు. నువ్వు ఎక్కడో ఎవరితోనో ఉన్నావు. అదంతా నేను చెప్పాలనుకోవటం లేదు. పవిత్రా లోకేష్ నా ఫ్రెండ్, గైడ్, ఓ మంచి తోడు. అది నా హక్కు. నేను నా భార్యకు విడాకులు ఇచ్చింది పవిత్రా లోకేష్ కోసం కాదు. పవిత్రా లోకేష్ నా లైఫ్‌లోకి వచ్చి 4 సంవత్సరాలు మాత్రమే అయింది. కానీ, నేను నీతో 8 ఏళ్ల క్రితంనుంచే దూరంగా ఉంటున్నాను.
ఎందుకు దాన్ని లింక్ చేస్తున్నావు. అదో ప్లాన్.. ఓ మంచి సంబంధాన్ని విడగొట్టడానికి. నన్ను దారుణంగా బద్నాం చేయటానికి. ఆమె తనను తాను బెంగళూరులో మంచిగా ప్రొజెక్ట్ చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తోంది. 5 బర్డ్స్ ఇన్ వన్ షాట్ అనేది వాళ్ల ప్లాన్!’’ అని అన్నారు. మరి, భార్యపై నటుడు నరేష్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : నరేష్ మూడో భార్య షాకింగ్ కామెంట్స్.. నేను ఇంకా ఆయన భార్యనే.. విడాకుల పేపర్లపై సంతకం చేయలేదు!