Senior Naresh Third Wife Ramya Shocking Comments: గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాల్లో సీనియర్ నటుడు నరేష్ నాలుగో వివాహానికి సంబంధించిన వార్తలు జోరుగా ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. నరేష్, నటి పవిత్రా లోకేష్‌ను వివాహం చేసుకోబోతున్నారు అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై వీరిద్దరూ వేర్వేరుగా స్పందించారు. ఇక పవిత్రా లోకేష్ వ్యక్తిగత, వైవాహిక జీవితానికి సంబంధించిన పలు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా తెర మీదకు నరేష్ మూడో భార్య ఎంట్రీ ఇచ్చారు. తామిద్దరకు ఇంకా విడాకులు కాలేదని.. నరేష్ ఇంకా తన భర్తే అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు.. ఈ సందర్భంగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మాట్లాడుతూ.. ‘‘సీనియర్ నటుడు నరేష్‌తో నా సంబంధాలు ఇంకా తెగిపోలేదు. నేను ఇంకా విడాకుల పేపర్లపై సంతకం చేయలేదు. ఆయన భార్యనని చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఇక నరేష్ కి.. నా గురించి, నా కుటుంబం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన కుటుంబం గురించి మాట్లాడుకుంటే చాలు. నేను రఘువీరా రెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తినే. అయినా ఆ పేరును ఎప్పుడు వాడుకోలేదు’’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: క్రేజీ అప్డేట్ : అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ ప్యాన్ ఇండియా మూవీ! ఇక తాను డబ్బుల విషయంలో ఎవరిని మోసం చేయలేదని.. తనపై వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అని తెలిపారు. కరోనా పరిస్థితుల వల్ల కొంతమందికి తాను ఇవ్వాల్సిన డబ్బులు ఆలస్యంగా చెల్లించానని చెప్పుకొచ్చారు. కొంతరు ఆమె గురించి తప్పుగా ప్రచారం చేసి లబ్ది పొందాలని చూశారని ఆరోపించారు. ఇక తనపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని.. స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: Bandla Ganesh Trolled: దిల్ రాజు తండ్రైతే వేరే నిర్మాతకి కంగ్రాట్స్ చెప్పిన బండ్ల గణేష్! ట్వీట్ వైరల్! అంతేకాక సీనియర్ నరేష్ తన గురించి మీడియాలో తప్పుడు కథనాలు వచ్చేలా ప్రచారం చేస్తున్నారని ఆమె మండి పడ్డారు. తాను జర్నలిస్ట్ అయినప్పటికి తన మీదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాక తనకు ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ విషయంలో కన్ఫ్యూజన్ ఉందని.. అది ఇంకా సెట్ కాలేదని చెప్పుకొచ్చింది. మరి ఆమె వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: KGF-2 :ప్రశాంత్ నీల్ సూపర్ ట్విస్ట్! సలార్ మూవీలోకి యశ్ ఎంట్రీ!