టాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లతో దూసుకున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. ఇటీవల ఆయన హీరోగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సర్కారు వారి పాట. ఈ మధ్యే ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. ఇక కలెక్షన్ల పరంగా ఎక్కడ కూడా తగ్గేదే అంటూ సరికొత్త రికార్డులను సైతం తిరగరాస్తోంది. ఇదిలా ఉంటే నెక్ష్ట్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
కాగా వీరిద్దరి కలయికలో గతంలో ఖలేజా, అతడు వంటి సినిమాలు వచ్చాయి. దీంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా పూర్తవ్వగా షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇందులో మహేష్ బాబు సరసన పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Hrithik Roshan: KGF-3లో హృతిక్ రోషన్.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్!
ఇదే సినిమాకు సంబంధించి తాజాగా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. భారీ అంచనాలు నెలకొంటున్న ఈ మూవీలో విలన్ గా నందమూరి హీరో తారకరత్న నటించనున్నాడనే వార్త ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉంది అనేది తెలియాలంటే అధికారిక అనౌన్స్ మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. మరి నిజంగానే మహేష్ బాబుకు విలన్ గా నందమూరి తారకరత్న నటించనున్నాడా? నటిస్తే ఎలా ఉంటుందనే దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.