నందమూరి తారకరత్న శనివారం రాత్రి బెంగుళూరులోని నారాయణ హృదయాలయ కన్నుమూశారు. ఆయన మృతితో నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఈ మధ్యే పాలిటిక్స్ లోకి వచ్చే ఉద్దేశంతో చాలా ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి పర్యటించారు.
నందమూరి తారకరత్న శనివారం రాత్రి బెంగుళూరులోని నారాయణ హృదయాలయ కన్నుమూశారు. ఆయన మృతితో నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. జనవరి 27న నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు. అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ లోకల్ డాక్టర్స్ తో పాటు విదేశీ వైద్యులు సైతం అహర్నిశలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం తారకరత్న మరణవార్తతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది.
ఇక ఈ మధ్యే పాలిటిక్స్ లోకి వచ్చే ఉద్దేశంతో చాలా ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి పర్యటించారు. అదీగాక.. ఓ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని కూడా తారకరత్న ఆశించినట్లు సమాచారం. మరి తారకరత్న ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయాలనుకున్నారు? ఎవరెవరికి చెప్పారు? అనే వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రధాన నియోజకవర్గమైన గుడివాడ నుండి తారకరత్న పోటీచేయాలని భావించాడని టాక్ నడుస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లకు చెప్పాడని వినికిడి. వారిద్దరి నుండి కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా.. గుడివాడ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. కానీ.. కొన్నాళ్లుగా ఎమ్మెల్యే కొడాలి నానికి అడ్డా అయిపోయింది. నానికి పోటీగా నందమూరి ఫ్యామిలీ నుండి టీడీపీ అధిష్టానం తారకరత్నని బరిలోకి దింపాలని గట్టి ప్లాన్ తో ఉందట. ఒకవేళ తారకరత్న ఉండి ఉంటే.. గుడివాడ నుంచి పోటీ చేశాక పరిస్థితి ఎలా ఉండేదో మరి. అప్పట్లో లోకేష్ తో తారకరత్న భేటీ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతేగాక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందని తారకరత్న ఓ సందర్భంలో చెప్పాడు. దీంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడనే రూమర్స్ కి బలం చేకూరినట్లయింది. తారకరత్న ఇదివరకే చాలాసార్లు టీడీపీ ప్రచారాలలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. ఆ అనుభవం ఇప్పుడు ఎన్నికల్లో పోటీచేయడానికి యూస్ అవుతుందని అంతా భావించారు.