నటసింహం నందమూరి బాలకృష్ణ అంటే ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలయ్య డైలాగ్ చెప్పినా, తొడ గొట్టినా ఫ్యాన్స్ కు పూనకాలే. అదే బాలయ్యతో ఓ టాక్ షో ప్లాన్ చేస్తే? ఆ ఆలోచనతోనే ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ బాలకృష్ణతో అన్ స్టాపబుల్ షో నిర్వహించారు. అది ఎంత సక్సెస్ సాధించింది. టాప్ రేటెడ్ టాక్ షోగా దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. సీజన్ 1లో ఎంతో మంది టాప్ హీరోలను గెస్ట్స్ గా పిలిచిన నిర్వాహకులు త్వరలోనే సీజన్ 2 కూడా స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తైనట్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ప్రముఖ యాంకర్ తో హీరో విశ్వక్ సేన్ గొడవ! స్టూడియోలోనే బూతులు!
అన్ స్టాపబుల్ సీజన్- 1 ఏ స్థాయి విజయం సాధించిందో అందరూ చూశారు. ఇప్పుడు సీజన్- 2పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య తనదైనశైలిలో గెస్ట్ లను ప్రశ్నలు అడగడం.. వారితో చలాకీగా గడపడం అందరినీ ఆకట్టుకుంది. నిజానికి షో అనుకున్న దానికంటే ఎక్కువగానే క్లిక్ అయ్యింది. అందుకే సీజన్ 2కోసం గట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి గెస్ట్స్ లిస్ట్ కూడా బాగా పెద్దగానే ఉంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సీజన్ 1 కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో ప్రారంభించారు. ఈసారి సీజన్ 2 కోసం గెస్ట్స్ గా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వారు రానున్నట్లు చెబుతున్నారు. ఈ లిస్ట్ చూస్తే సీజన్ 2 మరో భారీ విజయం సాధిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇంక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంది. దానికి వర్కింగ్ టైటిల్ ‘NBK107’ అని పెట్టారు. అయితే ‘అన్నగారు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేయనున్నట్లు సమాచారం. ఒకరు ఏజ్డ్ బాలయ్య కాగా.. మరొకరు మాత్రం మోడ్రన్ లుక్లో కనిపించనున్నట్లు ఫిలిం వర్గాల్లో టాక్ నడుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ ని అభిమానులు ప్రేమగా అన్నగారు అని పిలుచుకునేవారు అదే పేరును ఈ సినిమాకి పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం మీరూ ఎదురుచూస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.