మెగాబ్రదర్ నాగబాబు మరోసారి రెచ్చిపోయారు. తమ్మారెడ్డికి తొలుత ఫేస్ బుక్ పోస్టుతో కౌంటర్ ఇచ్చిన నాగబాబు, ఇప్పుడు ఏకంగా వీడియో పోస్ట్ చేసి మాస్ వార్నింగ్ ఇచ్చారు. కుక్కకి కూడా ఉపయోగం లేదని రెచ్చిపోయారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా పాట ఆస్కార్ బరిలో నిలవడం, ‘నాటు నాటు’కు ప్రపంచస్థాయి గుర్తింపు రావడం అద్భుతమైన ఘట్టం. ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ వస్తుందా లేదా అనే విషయం పక్కనబెడితే.. అక్కడి వరకు తెలుగు సినిమా పాట వెళ్లడం టాలీవుడ్ ఎప్పటికీ గుర్తించుకోదగ్గ విషయం. అందరూ దీని గురించి మెచ్చుకుంటుంటే.. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ ఫ్లైట్ ఖర్చుల కోసమే ఏకంగా రూ.80 కోట్లు పెట్టారని అన్నాడు. దీంతో ఆయనపై ప్రతి ఒక్కరూ మండిపడుతున్నారు. లెక్కలున్నాయా అని ప్రతి ఒక్కరూ ఏకిపారేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఓసారి స్పందించిన మెగాబ్రదర్ నాగబాబు మరోసారి రెచ్చిపోయాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ఆస్కార్ నామినేషన్స్ లో నిలిపేందుకు కోట్లకు కోట్లు ఖర్చు చేశారని తమ్మారెడ్డి అనదం పెద్ద వివాదమైపోయింది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఘాటుగా స్పందిస్తున్నారు. రీసెంట్ గా ఫేస్ బుక్ లో తమ్మారెడ్డిని విమర్శిస్తూ పోస్ట్ పెట్టిన నాగబాబు.. ఇప్పుడు ఏకంగా ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా తమ్మారెడ్డి.. కోలుకోలేని విధంగా చురకలంటించారు. మీ వల్ల కుక్కకి కూడా ఉపయోగం లేదని కూడా అన్నారు. అలా దాదాపు 10 నిమిషాల పాటు మాట్లాడిన నాగబాబు.. తమ్మారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
”ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ బరిలో నిలవడం నిజంగా గొప్ప విషయం. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణి, కొరియోగ్రాఫర్ తోపాటు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ని మనం మెచ్చుకోవాలి. కానీ తమ్మారెడ్డి మాత్రం విమర్శిస్తున్నారు. అందరూ పొగుడుతున్నారు కదా అని ఈయన విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. మనం రిటైరైపోయాం. కుక్కకి కూడా పనికిరాం. ఎందుకు ఇలాంటి టైంలో ఈ కామెంట్స్. ఇంతకు ముందు మీరు రాజకీయంగా ఎన్ని మాట్లాడినా ఊరుకున్నాం. కానీ ఈసారి మాత్రం అస్సలు ఊరుకోను. మీరు ఎలా బతకాలో ఆలోచించండి. సినిమా ఇండస్ట్రీకి ఎలా ఉపయోగపడాలో ఆలోచించండి. నోటికొచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడితే ఎవరూ ఊరుకోరు. తమ్మారెడ్డి కంట్రోల్ యువర్ టంగ్’ అని నాగబాబు.. తమ్మారెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరి తమ్మారెడ్డిపై నాగబాబు మరోసారి ఫైరవడం, ఏకంగా వీడియో పోస్ట్ చేయడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.