యంగ్ హీరో నాగశౌర్య వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. బెంగళూరుకు చెందిన యువ పారిశ్రామికవేత్త, ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో నాగశైర్య వివాహం జరిగింది. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో వీరి పెళ్లి వేడుక ఎంతో వైభవంగా జరిగింది. పెళ్లికి ముందు ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఇదే హోటల్లో జరిగాయి. ఆదివారం ఉదయం 11:25 గంటలకు అనూష శెట్టి మెడలో నాగశౌర్య మూడుముళ్లు వేశారు. ఈ వివాహ వేడుక ఔట్-డోర్లో జరిగింది. పెళ్లి మండపాన్ని విభిన్న రకాల పూలతో ఎంతో అందంగా, కలర్ఫుల్గా అలకంరించారు. నాగశైర్య-అనూష శెట్టిల ఇరువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రత్యేక అతిథులు, సినీ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
పెళ్లి వేడుకలో నాగశౌర్య సంప్రదాయ పట్టు పంచెకట్టులో రాకుమారుడిలా మెరిసిపోగా.. పెళ్లి కుమార్తె అనూష శెట్టి.. ఎరుపు, బంగారు వర్ణం పట్టుచీరలో.. అత్యంత ఖరీదైన.. అద్భుతమై డైమండ్ సెట్ ధరించి రాకుమారిలా మెరిపిపోతూ కనిపించారు. ఇక వీరి పెళ్లి సందర్భంగా తీసిన పలు వీడియలో.. ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#LetsGoShaan #NagaShaurya #AnushaShetty @IamNagashaurya pic.twitter.com/eQn2hNw4oW
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 20, 2022
పెళ్లి అనంతరం అతిథులకు అదిరిపోయే వివాహ విందు ఇచ్చారు నాగశౌర్య-అనూష దంపతులు. అతిథుల కోసం స్టార్ హోటల్ అద్భుతమైన అరేంజ్మెంట్స్ చేసింది జంట. మన సంప్రదాయం ప్రకారం బంతి భోజనాలు పెట్టారు. అయితే, ఒక్కో అతిథికి ఒక్కో టేబుల్ వేశారు. ఈ టేబుల్స్ కూడా అష్టభుజ ఆకారంలో చాలా అందంగా ఉన్నాయి. పలు రకాల పసందైన వంటకాలతో అతిథులకు మరిచిపోలేని విందు భోజనాన్ని వడ్డించారు. వడ్డన చేసే వారు సైత పంచె ధరించండం అందరిని ఆకట్టుకుంది. ఇక విందులో 12 రకాల వంటకాలు.. నాలుగు రకాల స్వీట్లు వడ్డించినట్లు తెలుస్తోంది.ఈ వీడియో సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీన్ని చూసిన వారు.. ఈ మధ్య కాలంలో అంత బఫెట్ భోజనాల హడావుడే.. ఇంత ప్రశాంతంగా కూర్చొని తినేలా ఏర్పాటు చేయడం గ్రేట్ అంటున్నారు.
@IamNagashaurya 👌 pic.twitter.com/71NdpGjuAE
— devipriya (@sairaaj44) November 20, 2022