నభా నటేష్.. ఈ అమ్మడు కన్నడలో స్టార్ హీరో శివరాజ్ కుమార్ వజ్రకాయ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత 2018లో సుధీర్ బాబు హీరోగా నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ ని అందుకుంది. అప్పటి నుంచి ఇస్మార్ట్ బ్యూటీగా పేరుని సంపాదించుకుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో చేతినిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయింది. కానీ, ఆ క్రేజ్ ఎక్కువ రోజులు నిలవలేదనే చెప్పాలి. స్టోరీ సెలక్షన్ లో పొరపాటో, అదృష్టం కలిసి రాలేదో గానీ తర్వాత ఆమె ప్రాజెక్టులు సరైన విజయాలను అందుకోలేదు. 2021లో నటించిన చివరి సినిమా మాస్ట్రో కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ప్రస్తుతం నభా నటేష్ చేతిలో ఏ ప్రాజెక్టు లేదని చెబుతున్నారు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో అభిమానులకు మాత్రం టచ్ లోనే ఉంటోంది. ఎప్పుడూ ఫొటోషూట్లు, ఘాటు అందాలతో ఫొటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ నభా నటేష్ పోస్ట్ చేసిన చిత్రాలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. స్వెటర్, జీన్స్ షార్ట్ వేసుకుని కుర్చీలో కూర్చొని ఆమె ఇచ్చిన ఫోజులు నెట్టింట వైరల్ గా మారాయి.
ప్రస్తుతం అంతా ఎంతో అద్భుతంగా ఉందని, క్రిస్మస్, పండగ శోభ వెల్లివిరుస్తోంది, కొత్త సంవత్సరం కూడా ప్రారంభం కానుందిే అంటూ క్యాప్షన్ జోడించింది. ఆమె గ్లామర్ ట్రీట్ చూసిన ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఈ డస్కీ బ్యూటీ నుంచి తర్వాత ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో వేచి చూడాలి. గాడి తప్పిన తన కెరీర్ ని ఎలా మళ్లీ గాడిలోకి తెస్తుందో అని సినిమా వర్గాల్లో చర్చలు కూడా నడుస్తున్నాయి. కెరీర్ లో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలంటూ ఫ్యాన్స్ కూడా ఆకాంక్షిస్తున్నారు.