movie news : ‘‘మాగమాసం ఎప్పుడొస్తుందో… మౌనరాగాలెన్ని నాల్లో’’ పాట వినగానే ఠక్కున గుర్తొచ్చే ముఖం హీరోయిన్ లైలాది. ‘‘ఎగిరే పావురమా’’ సినిమా లైలాకు తెలుగు మొదటి సినిమా. ఈ పాట కూడా ఆ సినిమాలోనిదే. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. లైలా నటనకు మంచి మార్కులు రావటంతో పాటు అవకాశాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత వెంకటేష్ ‘‘పెళ్లి చేసుకుందాం’’.. బాలకృష్ణ ‘‘పవిత్ర ప్రేమ’’.. వడ్డే నవీన్ ‘‘లవ్ స్టోరీ 1999’’ సినిమాల్లో నటించారు. కేవలం తెలుగులోనే కాదు తమిళం,మళయాలం, కన్నడ సినిమాల్లోనూ నటించారు.
తనను సినిమాల్లోకి పరిచయం చేసిన హిందీలో మాత్రం రానించలేకపోయారు. మొదటి సినిమాతోటే హిందీకి గుడ్ బై చెప్పేశారు. 2006లో వచ్చిన తమిళ సినిమా ‘తిరుపతి’ లైలా చివరి సినిమా. మెహ్ది అనే వ్యాపార వేత్తతో వివాహం తర్వాత ఆమె సినిమాలకు స్వప్తి చెప్పారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. హీరో కార్తీ సినిమా ‘సర్ధార్’లో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ పాత్రకు ముందుగా సిమ్రాన్‌ను అనుకున్నారంట. అయితే, ఆమె బిజీగా ఉండటంతో లైలాను సంప్రదించారంట. ఆమెకు కథ నచ్చటంతో ఓకే చెప్పారంట.కాగా, లైలా ఈటీవీ కామెడీ షో జబర్థస్త్‌లో జడ్జిగా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు జీ తమిళ్‌లో డ్యాన్స్ జోడీ.. డ్యాన్స్ జూనియర్స్(2019 డ్యాన్స్ షోలో జడ్జిగా), గోకుల్ అత్తిల్ సీతయ్(2020) టీవీ సీరియల్‌లో గెస్ట్ అప్పియరన్స్ ఇచ్చారు. లైలా రీఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : తెలుగు సినిమాల్లో నటించను.. బాలీవుడ్ హీరో నోటి దురుసు!