Movie News : ప్రముఖ దర్శకుడు శరత్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన అందుకు చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఉదయం ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. శరత్ మరణంతో పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. పలువురు ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం తెలుపుతున్నారు. బాలకృష్ణ, సుమన్‌లతో హిట్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.
1986లో వచ్చిన ‘చాదస్తపు మొగుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో సుమన్, భానుప్రియ లీడ్ రోల్స్ చేశారు. బాలకృష్ణ, సుమన్‌లతో ఎక్కువ సినిమాలు చేశారాయన. వీరి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయి. బాలకృష్ణతో వంశానికొక్కడు, వంశోద్ధారకుడు, పెద్దన్నయ్య, సుల్తాన్ సినిమాలు చేశారు. సుమన్‌తో ‘చాదస్తపు మొగుడు’, పెద్దింటి అల్లుడు, బావ-బావమరిది, చిన్నల్లుడు సినిమాలు చేశారు.