movie news : ప్రముఖ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానిలు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారనే వార్తలు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ స్టార్ కపుల్ మరి కొద్దిరోజుల్లో పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరికీ తాజాగా ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సౌత్ ఇండియాకు సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ ఛానల్ తమ ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, ఇతర ఏ మీడియా సంస్థలు ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానిలకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు న్యూస్ ఇవ్వలేదు. ఆ జంట కూడా దీనిపై ఏ విధంగానూ స్పందించలేదు. మరి వారికి నిజంగానే ఎంగేజ్‌మెంట్ జరిగిందా లేక ఇవన్నీ ఒట్టి పుకార్లా.. అన్నది తెలియరావాల్సి ఉంది.
ప్రముఖ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి. డైరెక్టర్ తేజ తీసిన ఒక విచిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మృగం సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రామ్‌చరణ్‌కు అన్నగా నటించి అందరి ప్రశంసలు పొందారు. ఇక నిక్కీ గల్రాని విషయానికి వస్తే.. ప్రముఖ నటి సంజనా గల్రానీ చెల్లెలు ఈమె. 2014లో వచ్చిన 1983 అనే మళయాల సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళం, మళయాల భాషల్లో కలిపి 30కిపైగా సినిమాలు చేశారు.
ఇదీ చదవండి: ‘‘ఆర్‌ఆర్‌ఆర్’’ చూసిన డైరెక్టర్ శంకర్.. ఆయన ఏమన్నారంటే..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.