సౌత్ ఇండియన్ సంగీత ప్రియులకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పేరు బాగా సుపరిచితం. తన ఎనర్జిటిక్ మ్యూజిక్ తో దేవి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగాడు. అయితే.. అగ్ర సంగీత దర్శకుడిగా దేవి ఎంత ఫేమస్ అవుతున్నాడో.. ఈ మధ్య వివాదాలకు కూడా కేరాఫ్ గా మారుతున్నాడు. గతేడాది ‘పుష్ప’ మూవీ ప్రమోషన్స్ లో దేవుళ్లపై కామెంట్స్ చేసి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా మరోసారి దేవుళ్ళ విషయం పై వివాదాస్పద కామెంట్స్ చేసి చిక్కుల్లో పడ్డాడు. శర్వానంద్, రష్మిక మందన జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’. మార్చి 4న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే జరిగింది. ఈ ఈవెంట్ లో దేవి శ్రీ మాటలు వివాదాలకు దారితీసింది.ఇంతకీ దేవి ఏం మాట్లాడాడంటే.. ‘డైరెక్టర్ కిషోర్ తిరుమల గారికి దేవుడి మీద భక్తితో మాలలు వేసుకునే అలవాటు ఉంది. ఆయనేమో అయ్యప్పమాల, శివమాల, మురగన్ మాల అని వెళ్తుంటారు. మేమేమో సీత, గీతా అని వెళ్తుంటాము’ అని అన్నాడు. దర్శకుడిని ఉద్దేశించి ఫన్నీగా చేసిన కామెంట్స్ ని ఇప్పుడు హిందు సంఘాలు తప్పు పడుతున్నాయి.
హిందువులు ఎంతో భక్తి, శ్రద్ధలతో వేసుకునే మాలల విషయంలో ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అలా మాట్లాడటంతో విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ దేవి శ్రీ కామెంట్స్ పై హెచ్చరించిన భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి ఫైర్ అయినట్లు తెలుస్తుంది. రాజా సింగ్ మాట్లాడుతూ.. ‘తన తప్పును దేవిశ్రీ ప్రసాద్ తెలుసుకుని క్షమాపణలు చెప్పాలని, లేకుంటే తెలంగాణ ప్రజలు చెప్పులతో కొడతారని’ హెచ్చరించాడు. మరి ఈ విషయం పై డీఎస్పీ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇక ఈ వివాదం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.