యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న తొలి చిత్రం విరూపాక్ష. ఏప్రిల్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. ఆ వివరాలు..
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరోహీరోయినట్లుగా తెరెకెక్కుతున్న చిత్రం ‘విరూపాక్ష’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు.. కార్తిక్ వర్మ.. విరుపాక్ష సినిమాకు దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆదివారం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఏలూరులోని సీఆర్ రెడ్డి కాలేజ్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. ఈ సందర్భంగా సుకుమార్.. ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తిక్ వర్మ ఎలాంటి క్రిటికల్ మెడికల్ కండిషన్ నుంచి బయటపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడో చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. ‘‘కార్తిక్ నా దగ్గరకు వచ్చినపుడు తన జీవితం చాలా చిన్నది. కార్తిక్‌కు ఒక మెడికల్ ప్రాబ్లెమ్ ఉండేది. తాను ఐదారేళ్లు మాత్రమే బతుకుతాడని డాక్టర్లు చెప్పారు. వాళ్ల అమ్మతో సహా హైదరాబాద్ వచ్చేశాడు. తను నా దగ్గరకు వచ్చినప్పుడు అలాంటి క్రిటికల్ కండిషన్‌లో ఉన్నాడు. తాను తన ఆరోగ్యం గురించి ఆలోచించలేదు.. పోయేలోగా ఒక్క సినిమాకు అయినా దర్శకత్వం చేయాలనుకున్నాడు. వాళ్ల అమ్మ దీవెనలు ఫలించాయి. క్రమక్రమంగా ఆ సమస్య నుంచి కోలుకున్నాడు. అనారోగ్యం నుంచి బయటపడి.. ఈ సినిమాను విజయవంతంగా పూర్తి చేశాడు. తను సినిమా కంప్లీట్ చేయడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎమోషనల్‌గా ఉంది. అనారోగ్యం కారణంగా కార్తిక్.. నిరంతరం స్టెరాయిడ్స్ మీద బతికేవాడు. అవి తీసుకోకుంటే బాడీలో ప్లేట్స్‌లెట్స్ పెరగవు. ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడ్డాడంటే వాళ్ల అమ్మ ఆశీస్సులే కారణం’’ అని చెప్పుకొచ్చాడు సుకుమార్.
‘‘కార్తిక్.. చాలా చక్కగా ఈ సినిమా తీశాడు. ఇక ఈ సినిమాకు సంయుక్త సెట్ కాదు అనుకున్నాను. కానీ కార్తిక్ తనను నమ్మాడు. చాలా అందంగా ఉంది. తను చాలా బాగా తెలుగు మాట్లాడుతుంది. అలానే కాంతార సినిమాకు పని చేసిన సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్.. విరూపాక్ష సినిమాకు పని చేశాడు. ఇక చివరగా సాయి ధరమ్ తేజ్ గురించి చెప్పుకొవాలి. తనను తొలిసారి దిల్ రాజు గారి అమ్మాయి పెళ్లిలో చూశాను. సాయి జనరల్‌గా విపరీతంగా జోక్స్ పేలుస్తుంటాడు. తన జోక్స్‌కు రైటర్స్ కూడా సరిపోరు. అంత జోవియల్‌గా ఉండే సాయి.. యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి ‘విరూపాక్ష’ సెట్స్‌కి వెళ్లి చూసినపుడు నేను వణికిపోయాను. కన్నీళ్లు ఆగని స్థితి. నటించడానికి అక్షరం అక్షరం కూడబులక్కుంటున్నాడు. అయినా పట్టుదలగా ఒక్కొక్కటి నేర్చుకుని నటించాడు. నిజానికి సాయికి ఇది మనిషిగానే కాక నటుడిగా పునర్జన్మ. ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నాడు’’ అని తెలిపాడు. సుకుమార్ స్పీచ్ వైరల్‌గా మారింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.