'ఆర్ఆర్ఆర్' స్టార్ ఎన్టీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఇతడికి ఓ అభిమాని షాకిచ్చాడు. పైకి దూసుకొచ్చి ఏకంగా అలా చేశాడు. ఇప్పుడు ఇది కాస్త వైరల్ అయింది.
హీరోలు- అభిమానులు.. ఇది విడదీయలేని సంబంధం. సినిమా మొదలైన దగ్గర నుంచి ఫ్యాన్స్ హడావుడి మాములుగా ఉండదు. హిట్ కొట్టాలి. కోట్లకు కోట్లు కలెక్షన్స్ రావాలి అని గట్టిగా కోరుకుంటూ ఉంటారు. అయితే కొందరు ఫ్యాన్స్ వల్ల మాత్రం హీరోలు తెగ ఇబ్బందిపడుతుంటారు. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే జరిగింది. ఆస్కార్ తో గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ని తాజాగా ఓ అభిమాని భయపెట్టేశాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. ఇంతకీ ఇది ఎప్పుడు ఎక్కడ జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ ఈ పేరుకు టాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ ఉంది. టీనేజ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరసగా హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత అప్ అండ్ డౌన్స్ చాలానే ఫేస్ చేశాడు. కానీ ‘టెంపర్’ నుంచి మాత్రం పూర్తిగా స్టైల్ మారిపోయింది. వరస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. గతేడాది ‘ఆర్ఆర్ఆర్’తో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న తారక్.. తాజాగా ఆ సినిమాకు ఆస్కార్ రావడంతో గ్లోబల్ వైడ్ ఫేమస్ అయిపోయాడు. గత నెలరోజుల నుంచి అమెరికాలో ఉన్న తారక్.. రీసెంట్ గానే స్వదేశానికి తిరిగొచ్చేశాడు.
అలా వచ్చేశాడో లేదో అస్సలు తీరిక లేకుండా బిజీ అయిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ‘దాస్ కా దమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో ఆస్కార్ గురించి, విశ్వక్ సేన్ సినిమా గురించి మాట్లాడాడు. స్పీచ్ తర్వాత స్టేజీ దిగుతుండగా.. సడన్ గా ఓ అభిమాని ఎన్టీఆర్ పైకి దూసుకొచ్చి పట్టేసుకున్నాడు. బౌన్సర్స్ వారించే ప్రయత్నం చేశారు గానీ తారక్ వద్దని చెప్పడంతో హగ్ చేసుకుని వెళ్లిపోయాడు. దీంతో అక్కడున్న వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. మరి ఎన్టీఆర్ ని అభిమాని ఇబ్బందిపెట్టడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.