హీరోయిన్ రోజా అంటే ఒకప్పటి ఫ్యాన్స్ గుర్తుపడతారు. మంత్రి రోజా అంటే ఇప్పుడు యూత్ గుర్తుపట్టేస్తారు. ‘జబర్దస్త్’ జడ్జి రోజా అంటే మాత్రం పిల్లల్ని నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ గుర్తుపట్టేస్తారు. అంతలా పాపులర్ అయిన ఈమె అటు ఇండస్ట్రీ, ఇటు పాలిటిక్స్ లోనూ ఫైర్ బ్రాండ్. న్యూస్, సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఓ విషయమై రోజా గురించి మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి ఆమె.. ఇప్పుడు తనలోని డ్యాన్స్ టాలెంట్ ని మరోసారి బయటపెట్టింది. అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ గా రోజా చాలా ఫేమస్. తెలుగు, తమిళంలో ఒకప్పటి స్టార్ హీరోలందరితోనూ యాక్ట్ చేసింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లోనూ పలు ఆసక్తికర పాత్రలు చేసింది. ఎప్పుడైతే ‘జబర్దస్త్’ షోకు జడ్జిగా వచ్చిందో రోజా.. ప్రతి ఇంట్లోనూ ఓ మెంబర్ అయిపోయింది. ఆమె నవ్వుకి చాలామంది ఫిదా అయిపోయారు. ఆ తర్వాత వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ‘జబర్దస్త్’ జడ్జిగా కొనసాగుతూనే వచ్చింది. ఇక కొన్నాళ్ల క్రితం ఏపీ కేబినెట్ లో మంత్రి పదవి రావడంతో బుల్లితెరకు పూర్తిగా దూరమైంది. ‘జబర్దస్త్’ నుంచి తప్పుకుంది.
తాజాగా జరిగిన దసరా ఎపిసోడ్ లో కనువిందు చేసిన రోజా.. జస్ట్ అలా కనిపించింది అంతే. డ్యాన్స్ చేసి చాలాకాలమే అయిపోయింది. దీంతో రోజా ఫ్యాన్స్ చాలామంది ఆమె డ్యాన్స్ కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ఇక అక్టోబరు 15న ప్రపంచ కూచిపూడి నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే కూచిపూడిలోని భామాకలాపం నృత్యాన్ని మంత్రి రోజా చేసి చూపించారు. తనలో ఛరిష్మా ఇంకా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. రోజా క్లాసికల్ డ్యాన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.