ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం పెద్ద వివాదానికి దారి తీసింది. యూనివర్సిటీకి సంబంధించి ఎన్టీఆర్ మార్చడాన్ని టీడీపీ నేతలు, ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశంపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా స్పందిస్తూ వచ్చారు. అయితే బాలకృష్ణ పేరు మార్చే అంశంపై కాస్త ఘాటుగానే స్పందించారు. వైసీపీ నేతలు సీదిరి అప్పలరాజు, విడదల రజిని, జోగు రమేష్, గుడివాడ అమర్నాథ్ తదితరులు స్పందించగా.. తాజాగా మినిస్టర్ రోజా బాలయ్య వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన డైలాగ్‌తోనే బాలయ్యను ఎటాక్ చేశారు రోజా.
ఈ వివాదంపై రోజా స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా.. ‘‘బాలయ్య ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ అన్న ముందు కాదు. అక్కడ ఉన్నవది రీల్ సింహం కాదు.. జ‘‘గన్’’ అనే రియల్ సింహం. తేడా వస్తే దబిడి దిబిడే’’ అంటూ సెటైర్స్ వేశారు రోజా. ప్రస్తుతం ఆమె ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు… జగన్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ”గన్” అనే రియల్ సింహం 🦁
తేడా వస్తే దబిడి దిబిడే..!!
— Roja Selvamani (@RojaSelvamaniRK) September 24, 2022
ఇక ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు అంశంపై బాలయ్య స్పందిస్తూ… “ఎన్టీఆర్ అనేది పేరు కాదు. సంస్కృతి. మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు.. ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగుజాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు” అంటూ బాలకృష్ణ ట్వీట్ చేశారు. అయితే ఈ బాలకృష్ణ ట్వీట్ పై వైసీపీ నేతలు ఘాటుగానే జవాబిచ్చారు. తాజాగా రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.