ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు రాజకీయ రంగు పులుముకుంది. ఎన్టీఆర్ మార్చడాన్ని టీడీపీ నేతలు, ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై నందమూరి వారసులు ఒక్కొక్కరిగా స్పందిస్తూ వచ్చారు. మొదట జూనియర్ ఎన్టీఆర్, తర్వాత కళ్యాణ్ రామ్ స్పందించగా.. బాలకృష్ణ కూడా ఈ అంశంపై ఘాటుగానే స్పందించారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ధీటుగా బదులిస్తున్నారు. “ఎన్టీఆర్ అనేది పేరు కాదు. సంస్కృతి. మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు.. ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగుజాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు” అంటూ బాలకృష్ణ ట్వీట్ చేశారు. అయితే ఈ బాలకృష్ణ ట్వీట్ పై వైసీపీ నేతలు ఘాటుగానే జవాబిచ్చారు.
మంత్రి సీదిరి అప్పలరాజు ఈ అంశంపై స్పందించారు. బాలకృష్ణను ఉద్దేశించి ట్వీట్ చేశారు. “బాలకృష్ణా.. వెన్నుపోటు పొడిచిన వారంతా ఎన్టీఆర్ భక్తులమని చెబుతున్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన జగన్ గారిపై బురద చల్లుతున్నారు. ఎంత గొప్ప మనుషులురా బాబు మీరు” అంటూ ట్వీట్ చేశారు. ఇక గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ.. “ఎన్టీఆర్ మీద బాబు చెప్పులు వేయిస్తే.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి పూలు వేయించారు జగన్. బోత్ ఆర్ నాట్ సేమ్” అంటూ అఖండ మూవీలో బాలకృష్ణ డైలాగ్ ఫోటోని షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇదే క్రమంలో అంబటి రాంబాబు, విడదల రజనీ కూడా బాలకృష్ణకి ధీటుగా బదులిచ్చారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
బాలకృష్ణా..
వెన్నుపోటు పొడిచిన వారంతా ఎన్టీఆర్ భక్తులమని చెబుతున్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టిన జగన్‌గారిపై బురద చల్లుతున్నారు. ఎంత గొప్ప మనుషులురా బాబు మీరు.— DrSeediri (@drseediri) September 24, 2022
Both are not same…
ఎన్టీఆర్ మీద బాబు చెప్పులు వేయిస్తే
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి పూలు వేయించారు జగన్ pic.twitter.com/zAiGZdvH9G
— Gudivada Amarnath (@gudivadaamar) September 24, 2022
జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య ..!
— Ambati Rambabu (@AmbatiRambabu) September 24, 2022
బాలకృష్ణా…
గవర్నమెంట్ హాస్పిటల్స్‌ను, పిల్లల్ని ఎలుకలు కొరికే హాస్పిటల్స్, సెల్‌ఫోన్ లైట్లలో ఆపరేషన్లు చేసే హాస్పిటల్స్‌గా మార్చిన మీ ఎల్లో గ్యాంగ్… అయినా మెడికల్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరే ఉండాలనుకుంటోంది!. ఇది కరెక్టేనా.?— Rajini Vidadala (@VidadalaRajini) September 24, 2022
బాలకృష్ణా…
ప్రజల హెల్త్ అంటే మీకు ఎంత చులకన?!. 104, 108 వాహనాలను పాడు పెట్టి, ఆరోగ్యశ్రీని చంపేసి హెల్త్ యూనివర్సిటీకి మాత్రం ఎన్టీఆర్ పేరు ఉంచాలని ఉద్యమాలు చేస్తారా.?— Rajini Vidadala (@VidadalaRajini) September 24, 2022