ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి యూనివర్సిటీ పేరు మార్చడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై నందమూరి వారసులు ఒక్కొక్కరిగా స్పందిస్తూ వస్తున్నారు. మొదట జూనియర్ ఎన్టీఆర్ స్పందించగా.. ఆ తర్వాత కల్యాణ్ రామ్ పేరు మార్చడాన్ని తప్పుబట్టారు. ఎన్టీఆర్- వైఎస్ఆర్ విశేష ప్రజాధరణ కలిగిన నేతలని.. ఇలా ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెడితే వచ్చే లాభమేంటని ప్రశ్నించారు. అయితే తాజాగా ఇదే అంశంపై నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించారు.
పేరు మార్పు అంశాన్ని నందమూరి బాలకృష్ణ ఖండించారు. మార్చేయాలి, తీసేయాలి అనుకోవడానికి ఎన్టీఆర్ అనేది పేరు కాదు.. సంస్కృతి అంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు. “మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు.. ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగుజాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్టు పేరు మార్చారు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నారు” అంటూ బాలకృష్ణ ట్వీట్ చేశారు. బాలకృష్ణ స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.