దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ వరల్డ్ వైడ్ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఇప్పటికే నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం.. ఇంకా ఆస్కార్ కి నామినేట్ అవ్వడంతో ఇండియన్ ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రామ్ చరణ్.. వరల్డ్ వైడ్ పాపులర్ అయిన 'గుడ్ మార్నింగ్ అమెరికా' ఇంటర్వ్యూలో పాల్గొని.. మొట్టమొదటి ఇండియన్ సెలబ్రిటీగా రికార్డు సెట్ చేశాడు. కాగా.. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ వరల్డ్ వైడ్ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. బాహుబలి 2 తర్వాత రాజమౌళి నుండి వచ్చిన ఈ సినిమా.. దాదాపు రూ. 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేయడం విశేషం. అదీగాక మరోసారి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తాని చాటింది ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించగా.. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ తో ఆర్ఆర్ఆర్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో కొనసాగుతోంది. ఇప్పటికే నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం.. ఇంకా ఆస్కార్ కి నామినేట్ అవ్వడంతో ఇండియన్ ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ క్రమంలో తాజాగా రామ్ చరణ్.. వరల్డ్ వైడ్ పాపులర్ అయిన ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ ఇంటర్వ్యూలో పాల్గొని.. మొట్టమొదటి ఇండియన్ సెలబ్రిటీగా రికార్డు సెట్ చేశాడు. కాగా.. ఈ విషయంపై రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించి.. చరణ్ ని, దర్శకుడు రాజమౌళిని కొనియాడారు. ఆయన రియాక్ట్ అవుతూ.. రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా ప్రోగ్రాంలో కనిపించడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. అలాగే దర్శకుడు రాజమౌళి విజన్ లో నుండి పుట్టిన అద్భుతమైన ఐడియా.. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తోంది అంటూ ప్రశంసించారు.
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా ఫేమ్ సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇద్దరు కూడా ప్రెజెంట్ పాన్ ఇండియా మూవీస్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ పాన్ వరల్డ్ మూవీ అనౌన్స్ చేశాడు. అయితే.. ఆస్కార్ కి ఇంకా ఇరవై రోజులకు ముందే రామ్ చరణ్ అమెరికా వెళ్లడం.. అక్కడి మీడియాతో.. ప్రోగ్రామ్స్ తో సందడి చేస్తుండటం అనేది ఇండియన్ ఫ్యాన్స్ కి ఎంతో ఆనందాన్ని ఇస్తున్న విషయం. ప్రస్తుతం రామ్ చరణ్, రాజమౌళిలను కొనియాడుతూ చిరంజీవి పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
A Proud Moment for Telugu / Indian Cinema @AlwaysRamCharan ,features on the famed #GoodMorningAmerica
Amazing how the power of One passionate idea born in the visionary @ssrajamouli ‘s brain, envelopes the world!
Onwards & Upwards !! 👏👏https://t.co/Ur25tvt9r9 pic.twitter.com/SrpisRfviK
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 23, 2023